కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం 10 మంది మృతి

కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం 10 మంది మృతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయమిది. తగ్గుముఖం పడుతుంది అని అందరు భావిస్తున్న ఈ మహమ్మారి మాత్రం పెరిగిపోతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే అరకొర వసతులతో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సరైన భద్రత ప్రమాణాలు లేకపోవడంతో కోవిడ్ సెంటర్లలో  తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

కాగా శనివారం రొమేనియా దేశంలో కరోనా సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. పియాట్రా నీమ్ట్‌ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటెన్సివ్ కేర్ వార్డులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పదిమంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను పక్కనే ఉన్న మరో ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో సిబ్బంది కూడా గాయపడినట్లు సమాచారం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు