కరోనా కొత్త వైరస్ వచ్చేసింది.. B.1.1.28.2గా నామకరణం..పూణెలో గుర్తింపు.. చాలా డేంజర్ అంట..

కరోనా కొత్త వైరస్ వచ్చేసింది.. B.1.1.28.2గా నామకరణం..పూణెలో గుర్తింపు.. చాలా డేంజర్ అంట..

కరోనా కొత్త వైరస్ వచ్చేసింది.. B.1.1.28.2గా నామకరణం..పూణెలో గుర్తింపు.. చాలా డేంజర్ అంట..

కరోనా ఇది మామూలు వైరస్సే కావొచ్చు.. రోజురోజుకు మారిపోతున్న దీని రూపం మాత్రం హడలెత్తిస్తోంది. మొదటి దశలో వచ్చిన వైరస్ పెద్దగా ప్రభావం చూపకపోయినా.. మ్యూటేషన్ అయ్యి సెకండ్ వేవ్ లో భాగంగా ఇప్పుడు వచ్చిన వైరస్ మాత్రం అల్లకల్లోలం చేసింది. ఉధృతంగా వ్యాప్తి జరగటంతోపాటు.. మరణాల సంఖ్యను భారీగా పెంచింది. ఇంకా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గనే లేదు.. అప్పుడే మరో కొత్త కరోనా వైరస్ పుట్టుకొచ్చింది.

దేశంలో కొత్తగా గుర్తించిన కరోనా వేరియంట్ కు B.1.1.28.2 అనే పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. ఇది ఇంగ్లాండ్, బ్రెజిల్ దేశాల నుంచి వచ్చినట్లు తేల్చారు. గత రెండు నెలల్లో ఇంగ్లాండ్, బ్రెజిల్, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ రకం కరోనా వైరస్ గుర్తించారు. ఇది చాలా డేంజర్ అని తేల్చారు. ప్రస్తుతం నడుస్తున్న సెకండ్ వేవ్ కంటే.. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి జరగటంతోపాటు.. శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం అధికంగా చూపిస్తుందని నిర్థారించారు డాక్టర్లు.

ప్రస్తుతం భారతదేశంలో రెండు రకాల కరోనా వైరస్ లు మాత్రమే ఉన్నాయి ఇప్పటి వరకు. B.1.617, B.1.1.7 వేరియంట్‌ వల్లే ఇంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంది భారతదేశం. ఇప్పుడు కొత్తగా మ్యుటేషన్ అయిన వైరస్ కు B.1.1.28.2 పేరు పెట్టారు. దీని ప్రభావం ఎంత అనేది రాబోయే రోజుల్లోకానీ తెలియదు.

ఈ కొత్త కరోనా వేరియంట్ ఇప్పుడున్న వ్యాక్సిన్లకు తగ్గుతుందా లేదా.. అరికడుతుందా లేదా.. వ్యాక్సిన్లతో ఈ కొత్త రకం వైరస్ కంట్రోల్ అవుతుందా లేదా అనేది ఇంకా తేల్చలేదు వైద్యులు.

ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్నాం అని సంబర పడుతున్న ఈ టైంలో.. ఈ కొత్త రకం కరోనా వైరస్ ఏంటీ అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు