పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ : ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ – ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు

pavana kalyan covid positive

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత వకీల్ సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు. ఆ తర్వాత తన భద్రత, వ్యక్తిగత సిబ్బంది ఒక్కొక్కరూ అనారోగ్యం బారిన పడటం.. ఈ సమయంలో వారికి పాజిటివ్ అని నిర్థారణ కావటంతో.. నాలుగు రోజుల క్రితమే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్.

ఏప్రిల్ 15వ తేదీ.. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా టెస్ట్ చేయించుకున్నారు పవన్ కల్యాణ్. శనివారం రిజల్ట్ వచ్చింది. కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది.

పవన్ కల్యాణ్ రెండు రోజులుగా ఊపిరితిత్తుల్లో సమస్యతో బాధపడుతున్నారు. ఇన్ఫెక్షన్ అని నిర్థారణ అయిన తర్వాతే ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ వల్లే.. సహజంగా శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారంట జనసేనాని. ప్రస్తుతం ఫాంహౌస్ లోనే ఉన్న పవన్.. ఇప్పుడు ఆస్పత్రిలో జాయిన్ అవుతారా లేక అక్కడే ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటారా అనేది చూడాలి.

pavana kalyan covid positive

పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. ఆయన క్షేమంగా ఉన్నారు.. చికిత్స కొనసాగుతుంది అంటూ లేఖ విడుదల చేసింది జనసేన పార్టీ. అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆందోళన పడొద్దని.. ఎవరూ పరామర్శలకు రావొద్దని.. ఫోన్లు చేయొద్దని స్పష్టం చేసింది. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో మధ్య మధ్యలో ఆక్సిజన్ పెడుతున్నారు.

రాంచరణ్ భార్య ఉపాసన ఆధ్వర్యంలో.. అపోలో ఆస్పత్రికి చెందిన ఓ వైద్య బృందం.. ఫాంహౌస్ లోనే ఉండి చికిత్స అందిస్తున్నారు. అత్యవసరం అయితే ఆస్పత్రికి తరలిస్తాం అని.. ఇప్పటి వరకు అలాంటి సిట్యువేషన్ లేదని చెబుతున్నారు వైద్యులు.

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

See Also : గతంలోలా కాదు – కరోనా కొత్త లక్షణాలు ఇవే – అందులో ఒకటి గులాబి కళ్లు

See also : అప్పుడు వడదెబ్బ – ఇప్పుడు కరోనా – పవన్ కల్యాణ్ కు కలిసిరాని ఏప్రిల్ ఎన్నికల ప్రచారం

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు