ముందుంది కరోనా విలయం.. ఊహించని చావు ముప్పు.. భయపెట్టటం కాదు.. జరిగే వాస్తవం..

current situation in india

చస్తామని తెలిసి కూడా.. చావు రాజకీయం చేసే వాళ్ల కోసం కాదు ఈ వార్త.. ఈ సమాచారం. మనుషుల కోసం.. రాబోయే ముప్పు ఏ విధంగా ఉండబోతుంది.. చావులు ఎలా ఉంటాయనే నగ్న సత్యం తెలుసుకోవటం కోసమే ఈ సమాచారం ఇస్తున్నాం. జరగబోయే వాస్తవాన్ని జీర్ణించుకున్నప్పుడు గుండె నిబ్బరంతో దాన్ని జయించవచ్చు.

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని.. అదే స్థాయిలో మరణాలు భయాన్ని పుట్టిస్తున్నాయని మనుషులు బాధపడుతున్నారు. జనం ఆందోళన పడుతున్నారు. ఇప్పటి కంటే రాబోయే రోజుల్లో జరిగే విధ్వంసంపై మరింత గుండె దిటువు చేసుకోవాలంటున్నారు డాక్టర్లు, శాస్త్రవేత్తలు. మే నెలలో కరోనా కేసులు ఇప్పటి వరకు డబుల్ కాబోతున్నాయి.. మరణాలు సైతం రోజువారీగా 5 వేల వరకు వెళ్లవచ్చు.. దీనికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు అధికారులు.

ఇప్పుడే ఇలా ఉంటే అని భయపడకండి.. ఎందుకంటే అది ఎంతో కాలం లేదు కాబట్టి.. రాబోయే ఉపదృవాన్ని ఆపలేం కాబట్టి.. గుండె నిబ్బరంగా దాన్ని ఎదుర్కొందాం.. ఈ విషయం ఎవరు చెప్పారు అని మీకు డౌట్ రావొచ్చు.. హైదరాబాద్ కు చెందిన ఐఐటీ శాస్త్రవేత్తలతోపాటు కాన్ఫూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు చేసిన సర్వేలో ఈ విషయం బయటపడింది. మనోళ్లు ఇలా ఎందుకు చెబుతారు అనే డౌట్ వస్తే.. మరో క్లారిటీ ఇస్తున్నాం.. అమెరికాకు చెందిన వాషింగ్టన్, మిచిగాన్ వర్సిటీల విశ్లేషణ సైతం ఇంచుమించు ఇలాగే ఉంది.

మే నెలలో రోజు 8 నుంచి 10 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని.. చావులు 5 వేల వరకు ఉంటాయని అంతర్జాతీయ, జాతీయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా ఈ అంకెలు మారొచ్చని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్, మినీ లాక్ డౌన్, కంటైన్మంట్ జోన్లు పెట్టారు. ఇదే బాటలో ఏపీ, తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వ్యాపార వేళలు మార్చటం జరిగింది.

ఇలాంటి చర్యల ఇప్పటికే ఆలస్యం అయ్యాయని.. ఇంకా పూర్తిగా దేశం లాక్ డౌన్ కాలేదని.. ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకుంటే మాత్రం 20 శాతం కేసులు, మరణాలు తగ్గొచ్చని అంచనా వేసింది. దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టినా.. పెట్టక పోయినా మే నెలలో మాత్రం కనీసం రోజువారీ 7 లక్షల కేసులు.. 4 వేల మరణాలు అయితే ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఈ లెక్కలు ఎలా ఉన్నా.. గుండె నిబ్బరం చేసుకుని.. ఎల్లో మీడియా, బ్లూ మీడియా, పింక్ మీడియా, ఆరంజ్ మీడియా వార్తలకు కొంచెం దూరంగా ఉండి ఆలోచించండి.. ప్రభుత్వాలు ఏమీ చేయలేవు.. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండండి.. మనల్ని మనమే కాపాడుకుందాం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు