గతంలోలా కాదు – కరోనా కొత్త లక్షణాలు ఇవే – అందులో ఒకటి గులాబి కళ్లు

ఏడాది క్రితం కరోనా లక్షణాలకు.. ఇప్పుడు వస్తున్న కరోనా లక్షణాలకు చాలా తేడా ఉంది అంటున్నారు డాక్టర్లు. వైరస్ తోపాటు కనిపించే లక్షణాలు, వ్యాప్తి డిఫరెంట్ అంటున్నారు.

మొదటి విడత వచ్చిన కరోనాలో.. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవటం, ఊపిరి ఆడకపోవటం వంటివి కరోనా లక్షణాలు నిర్ధారించారు వైద్యులు. ఏడాది అయిపోయింది కదా.. కరోనా వైరస్ సైతం రూపం, లక్షణాలు మార్చుకుంది. ఇప్పుడు వస్తున్న కరోనా లక్షణాలు చాలా విచిత్రంగా.. ఊహించని విధంగా ఉంటున్నారు.

ఇప్పుడు.. మనకు కరోనా వచ్చింది అని నిర్థారించుకోవటానికి కొన్ని లక్షణాలు చెబుతున్నారు వైద్యులు. అందులో ఒకటి మీ కళ్లు గులాబీ రంగులోకి మారిపోతాయి, లూజ్ మోషన్స్ అవుతాయి.. వినికిడి సమస్య వస్తుంది.. అంటే చెవుడు వస్తుంది.. ఇప్పుడు వస్తున్న కరోనాలో ఇవే ప్రధానమైన లక్షణాలు అని నిర్థారించారు శాస్త్రవేత్తలు.

మొదటి దశలో వచ్చిన కరోనా యువత, పిల్లలపై ప్రభావం చాలా తక్కువగా చూపించింది. ఇప్పుడు అలా లేదు.. 15 శాతం మంది చిన్న పిల్లలకు కరోనా వస్తుంది. 21 నుంచి 35 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు సైతం 40 శాతం మంది కరోనా బారిన పడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా బారిన పడిన వారిలో 50 శాతం మంది 45 ఏళ్లలోపు వారు కావటం ఆందోళన కలిగించే అంశం. ఇక ఢిల్లీలో అయితే 60 శాతం మంది పేషెంట్లు.. 45 ఏళ్లలోపు వారు కావటంపై.. ఏకంగా ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

మొదటి విడతలో వ్యాప్తి అనేది 20 శాతంగా ఉంది. 100 జిల్లాల్లో ఎఫెక్ట్ అయ్యింది 20 శాతం వరకే.. ఇప్పుడు అలా లేదు.. 40 జిల్లాల్లో 75 శాతం వరకు వ్యాప్తి చెంది ఉంది వైరస్.. ఇది చాలా చాలా డేంజర్ అంటున్నారు శాస్త్రవేత్తలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు