కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది

కచ్చితంగా కాదు అంటున్నారు నిపుణులు. 92 శాతం వరకు విజయవంతం అయినట్లు మాత్రమే ఉన్నాయని.. జలుబు, దగ్గుతోపాటు జ్వరం ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్....

Covishield Coronavirus vaccine gets emergency use in India
Covishield Coronavirus vaccine gets emergency use in India

దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఆస్ట్రోజెనెకా, సీరమ్ కంపెనీలు కలిసి తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగించటానికి భారతదేశం అనుమతి ఇచ్చింది. అత్యవసర సమయాల్లో ఉపయోగించటానికి వీలుగా.. 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను కంపెనీ నుంచి తీసుకోవటానికి భారత్ సిద్ధం అయ్యింది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను సీరమ్ కంపెనీ.. భారత్ లో ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేస్తుండగా.. 10 కోట్ల డోసులు భారత్ లో వినియోగించటానికి సీరమ్ కంపెనీ కూడా అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. డ్రక్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. కేంద్రమే ఓకే అనటంతో.. డీజీసీఐ అనుమతి ఇక లాంఛనమే అంటున్నారు వైద్య నిపుణులు

కోవిషీల్డ్ వ్యాక్సిన్ 100 శాతం పని చేస్తుందా అంటే.. కచ్చితంగా కాదు అంటున్నారు నిపుణులు. 92 శాతం వరకు విజయవంతం అయినట్లు మాత్రమే ఉన్నాయని.. జలుబు, దగ్గుతోపాటు జ్వరం ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ ఉపయోగించరాదు అంటున్నారు వైద్య నిపుణులు.

ఇది కూడా అందరికీ.. ఎవరికి పడితే వాళ్లకు వేయటం సాధ్యం కాదని.. అత్యవసర సమయాల్లోనే అంటే.. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పుడు.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే ఉపయోగించే విధంగా సిఫార్స్ చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు