జీహెచ్ఎంసీలో 49 మంది క్రిమినల్ అభ్యర్థులు

నేర ఆలోచన, నేరాలు చేయాలనే బుద్ధి ఉన్నోళ్లకు ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుంది.. ప్రజా సేవ ఏం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఆషామాషీ కాదు.. క్రిమినల్ రికార్డ్ ఉన్నోళ్లే. మొత్తం 49 మంది అభ్యర్థులపై తీవ్రమైన నేర చరిత్ర ఉంది. బెటర్ ఫర్ హైదరాబాద్ అనే సొసైటీ సేకరించిన వివరాల ఇలా ఉన్నాయి.

క్రిమినల్ కేసులు ఉన్న 49 మంది అభ్యర్థుల్లో అత్యధికంగా బీజేపీ వారు 17 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానం కాంగ్రెస్ పార్టీదే. బీ-ఫాం ఇచ్చిన 13 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. 12 మంది టీఆర్ఎస్ అభ్యర్థులపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. పాతబస్తీ వరకు మాత్రమే పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్న రికార్డ్ ఉంది.

49 మంది అభ్యర్థులపై మొత్తం 96 కేసులు నమోదు అయ్యి ఉన్నాయి. వీటిలో చాలా కేసుల్లో విచారణ సందర్భంగా వీరు కోర్టులకు హాజరవుతూ ఉన్నారు. క్రిమినల్ కేసులు అంటే మామూలు విషయం కాదు.. నేర ఆలోచన, నేరాలు చేయాలనే బుద్ధి ఉన్నోళ్లకు ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుంది.. ప్రజా సేవ ఏం చేస్తారు అంటున్నారు హైదరాబాదీలు.

అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం క్రిమినల్ కేసులు ఉన్న 12 మందికి కార్పొరేట్ టికెట్లు ఇవ్వటం విశేషం. బీజేపీ ఏం తక్కువ తినలేదు.. ఏకంగా 17 మంది క్రిమినల్స్ ను బరిలోకి దించటం చర్చనీయాంశం అయ్యింది. 49 మందిలో 43 మంది పురుషులు అయితే.. ఆరుగురు మహిళలు ఉండటం అద్బుతం కాకపోతే ఏంటీ.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు