నీళ్లు తాగమని చెప్పిన వ్యక్తి … 29 వేల కోట్ల రూపాయలు నష్ట పోయిన కంపెనీ.

మంచి నీరు తాగండి అని ఓ వ్యక్తి ఇచ్చిన సలహాతో, కోకో కోల కంపెనీ 29 వేల కోట్ల రూపాయలు నష్ట పోయింది ఐతే ఇది చెప్పింది ఎవరో చిన్న వ్యక్తి కాదు పోర్చుగల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్. ఐతే ఇది అంత అనుకోకుండా జరిగి పోయింది యూరో కప్‌లో ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డ్.. హంగేరీతో మ్యాచ్‌కి ముందు మీడియా సమావేశానికి వచ్చాడు.యూరో కప్ అఫిషియల్ స్ఫాన్సర్లలో ఒకటి అయిన కోకో కోల కంపెనీ…రెండు చిన్న కోకో కోల బాటిల్స్‌ని ప్రచారం కోసం అక్కడ రోనాల్డో ముందు వున్నా టేబుల్‌పై పెట్టారు.

కానీ రోనాల్డో తన ముందు టేబుల్‌పై ఉన్న రెండు కోకకాలా చిన్న బాటిళ్లని పక్కనపెట్టి.. వాటర్ బాటిల్‌ని చూపిస్తూ మంచినీళ్లు తాగండి అని సలహా ఇచ్చాడు. ఇది అనుకోకుండా చేసింది అయినా దీని వాళ్ళ కోకో కోల కంపెనీ షేర్లు నష్టపోయాయి. ఈ నష్టం దాదాపు 29 వేల కోట్ల రూపాయలు.

క్రిస్టియానో రొనాల్డ్‌కి వున్నా ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకొని కోకకోలా కూడా అతని సూచనలపై స్పందించింది. ‘‘ప్రతి ఒక్కరికీ వేర్వేరు అవసరాలు, రుచులు ఉంటాయి. వారు తమకి నచ్చింది తాగడానికి ఇష్టపడతారు’’ అని ఓ ప్రకటనని విడుదల చేసింది.36 ఏళ్ళ క్రిస్టియానో రొనాల్డ్ ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తుంటాడు. మరియు కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉంటాడు.

అనంతరం హంగేరీతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన క్రిస్టియానో రోనాల్డో 3-0తో పోర్చుగల్ టీమ్‌ని గెలిపించాడు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు