ఈ 9 పాయింట్లు చదివితే చాలు దేశంలో కరోనా పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది.

current situation in india

భారతదేశంలో కరోనాపై ప్రపంచంలోని అన్ని దేశాలు సానుభూతి ప్రకటిస్తున్నాయి. సాయం చేస్తామంటూ ప్రకటన చేస్తున్నాయి. దేశంలో కరోనా ఇంత విలయతాండం చేస్తుందా. దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉంది.. ఏప్రిల్ 26వ తేదీ సోమవారం నాటి దుస్థితి ఏంటో.. చాలా బ్రీఫ్ గా తెలుసుకుందాం…

  1.  ఏప్రిల్ 26వ తేదీ సోమవారం ప్రకటించిన బులిటెన్ లో.. దేశంలో కొత్త 3 లక్షల 52 వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. 2 వేల 812 మంది అదికారికంగా చనిపోయారు.
  2. ఏప్రిల్ 15వ తేదీ నుంచి రోజువారీగా 2 లక్షల కేసులు నమోదవుతూ వస్తే.. ఐదు రోజులుగా అంటే ఏప్రిల్ 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఐదు రోజులుగా 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి.
  3. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ.. ఈ ఐదు రాష్ట్రల్లోనే 2 లక్షలకుపైగా కేసులు కొత్తగా రోజూ నమోదవుతూ వస్తున్నాయి.
  4. ఢిల్లీలో లాక్ డౌన్ మరో వారం పొడిగించారు. ఏప్రిల్ 19వ తేదీ రాత్రి నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ వల్ల.. కొత్త కేసులు 36 శాతం తగ్గినట్లు తెలిపింది ఢిల్లీ ప్రభుత్వం. దీంతో మరో వారం అంటే.. మే 3వ తేదీ రాత్రి వరకు లాక్ డౌన్ పొడిగించారు సీఎం కేజ్రీవాల్.
  5. డెహ్రడూన్ ఏప్రిల్ 26వ తేదీ సోమవారం రాత్రి నుంచి మే 3వ తేదీ ఉదయం వరకు కర్ఫ్యూ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
  6. దేశంలో కరోనా సునామీ ఉందని.. ప్రజలు ఆత్మవిశ్వాసంతో.. గుండె నిబ్బరంతో పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.
  7. గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని ఆయుష్ ఆస్పత్రిలోని కరోనా వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది.
  8. హర్యానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రెండు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక లోపం వల్ల విషాదం జరిగింది. ఏపీలోని విజయనగరం పట్టణంలోని ఆస్పత్రిలో నలుగురు చనిపోగా.. హర్యానాలోని రెవారీ ఆస్పత్రిలో నలుగురు పేషెంట్లు చనిపోయారు.
  9. భారతదేశంలో పరిస్థితులు చక్కబడే వరకు సాయం అందిస్తూనే ఉంటామని అమెరికా, ఇంగ్లాండ్, కెనడా దేశాలు ప్రకటించాయి.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు