గవర్నర్ తమిళిసైతో డీఎస్ భేటీ ఎందుకు?

టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎంపీ.. గవర్నర్ తో భేటీ కావటం మాత్రం

తెలంగాణ రాజకీయాల్లో.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, బీజేపీ ఎంపీ అర్వింద్ కుమార్ తండ్రి అయిన డి శ్రీనివాస్ గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. చాలా సేపు ఇద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్ర రాజకీయాలతోపాటు ఆరోగ్య విషయాలపై కుశల సమాచారం అడిగి తెలుసుకున్నారు.

నిజామాబాద్ లోక్ సభ స్థానంలో సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఎంపీ అరవింద్ ఓడించిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఆయన్ను దూరంగా పెట్టింది. కవితతో వచ్చిన రాజకీయ విబేధాల వల్ల కూడా ఆయన సైలెంట్ అయ్యారు.

దుబ్బాకలో బీజేపీ చేతిలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత.. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న సమయంలో.. గవర్నర్ తమిళిసైతో గవర్నర్ భేటీ కావటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీకి కావాల్సిన వ్యూహాత్మక ఎత్తుగడులతోపాటు హైదరాబాద్ సిటీపై డీఎస్ కు ఉన్న పట్టు, అనుచరులు, సిటీలో ప్రచార వ్యూహానికి సంబంధించి కీలక మైన చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది.
టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎంపీ.. గవర్నర్ తో భేటీ కావటం మాత్రం సంచలనంగా మారింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు