కరోనాకు మందు కనిపెట్టిన DRDO- ఓకే చెప్పిన కేంద్రం – గ్లూకోజ్ లా నీళ్లలో కలిపి తాగడమే

2-deoxy-D-glucose

కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలాడుతోంది.. చికిత్సకు మందులేదంటూ వ్యాక్సిన్ తీసుకొచ్చాయి చాలా దేశాల్లో చాలా కంపెనీలు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి.. హైదరాబాద్ కేంద్రంగా కరోనా చికిత్స అద్భుతమైన మందు కనిపెట్టారు. DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఇంకా డాక్టర్ రెడ్డీస్ లేబోరేటర్ సంయుక్త ఆధ్వర్యంలో 2-DG అనే మందు కనిపెట్టారు.

2-DG అంటే 2-డీయాక్సీ D-గ్లూకోజ్ అనే డ్రగ్ ను హైదరాబాద్ లోనే పరిశోధనల తర్వాత తయారీకి రెడీ అవుతున్నారు. కరోనా రోగులకు ఇది ఎంతో బాగా పని చేస్తుందని.. కరోనా పాజిటివ్ వచ్చిన దీన్ని తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టటంతోపాటు.. దాన్ని సమర్థవంతంగా నిర్మూలన చేస్తుందని గుర్తించారు.

పొడి రూపంలో ఉండే ఈ మందును.. మంచినీళ్లలో కలిపి తీసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే గ్లూకోజ్ వాటర్ తాగినట్లు తాగాలి. తర్వాత శరీరంలోని కరోనా వైరస్ చచ్చిపోయి.. రోగి వేగంగా కోలుకోవటానికి ఉపయోగపడుతుందని డీఆర్ డీవో వివరించింది.

రెండో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ మందును పలువురు రోగులపై ప్రయోగించి చూడగా.. ఆర్టీ-పీఆర్సీ టెస్ట్ లో నెగెటివ్ వచ్చినట్లు చెబుతున్నారు డాక్టర్లు. ఈ నెల నుంచే ఫేజ్ 2 ట్రయల్స్ ప్రారంభం అవుతాయని వివరించారు. దీనికి సంబంధించిన అన్ని అనుమతులు వచ్చాయని.. అన్నీ సక్రమంగా జరిగితే.. 2021, అక్టోబర్ నుంచి కరోనాకు మందు వచ్చినట్లే అనిచెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా చికిత్సకు మందు లేదు.. లక్షణాలు ఆధారంగా ఆయా రోగానికి ఆయా మందులు వాడుతూ వస్తున్నారు. ఈ ప్రయోగాలు సఫలం అయితే జలుబు, దగ్గు, జ్వరానికి మందులు వేసుకున్నట్లే.. కరోనాకు సైతం మందు వేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పటికే ఈ ఫలితాలు 70 శాతం వరకు సక్సెస్ అయ్యాయని.. రెండో దశలో విస్తృత పరిశోధనల తర్వాత ఈ ఏడాదిలోనే కరోనాకు మందు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

DRDO – రెడ్డీస్ లేబోరేటరీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు