ధోనీపై చెన్నై జట్టుకు బిజినెస్ పాఠాలు

మూడేళ్ల వరకు ఆడకపోవచ్చని.. అందుకే ఇప్పుడే తప్పించాలని సూచించారు.

వచ్చే ఏడాది ఎల్లో జెర్సీని కూడా వదిలేస్తున్నావా అన్న ప్రశ్నకు.. డెఫ్‌నెట్లీ నాట్‌ అని సమాధానమిచ్చిన ధోనీ.. ఇప్పుడా చెన్నై జట్టుకే భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇండియన్ క్రికెట్‌లో అరుదైన ఆటగాడిగా.. సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా, ఒంటిచేత్తో విజయాలను అందించిన ఆల్‌రౌండర్‌గా అతడి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అలాంటి ఆటగాడు ప్రస్తుతం ఐపీఎల్‌కు మాత్రమే ఆడుతున్నాడు. మొన్నటి ఐపీఎల్‌ 13 వ సీజన్‌లో జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు రావడంతో పాటు.. కేప్టెన్‌ ధోనీని తప్పించాల్సిందే అనే వాదనలు వినిపించాయి.

ధోనీని ఇలాగే కొనసాగించాలంటే చెన్నై జట్టుకి ఆర్థిక భారం పడుతుందని.. టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చారు. అదెలా అంటే అంటూ.. లెక్కలు వివరించారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో 9వ జట్టును తీసుకోవాలనుకునే యోచనలో బీసీసీఐ ఉంది. 2021లో ఐపీఎల్‌ ఆటగాళ్ల కోసం మెగా వేలం వేయనున్నారు. ఈ సమయంలో చెన్నై జట్టు ధోనీని ఇప్పటికిప్పుడు వదులుకుంటే 15 కోట్లు మిగులుతాయని ఆకాశ్ చోప్రా చెప్పారు. మెగా వేలంలో తీసుకొనే ప్లేయర్‌.. మూడేళ్ల పాటు కొనసాగుతాడు. ధోనీ మూడేళ్ల వరకు ఆడకపోవచ్చని.. అందుకే ఇప్పుడే తప్పించాలని సూచించారు.

అలా మిగిలిన మొత్తంతో మరో ఆటగాడిని తీసుకొవచ్చన్న ఆకాశ్ చోప్రా.. అవసరం అనుకుంటే ధోనీని రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెగా వేలానికి వెళ్లడం చెన్నై జట్టుకు ఎంతో అవసరమని.. రిటైన్డ్‌ చేసుకునేంత స్థాయిలో ఆటగాళ్లు లేరంటూ చెన్నై జట్టుకు ఆకాశ్ చోప్రా ఆర్థిక పాఠాలు చెప్పుకొచ్చారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు