23వ తేదీ.. శుక్రవారం.. మనిషి మారాడు అంతే.. చంద్రబాబు హయాంలోనే ధూళిపాళ్లపై హైకోర్టులో కేసులు

23వ తేదీ.. శుక్రవారం.. మనిషి మారాడు అంతే.. చంద్రబాబు హయాంలోనే ధూళిపాళ్లపై హైకోర్టులో కేసులు

dulipalla narender
dulipalla narender

23వ తేదీ.. శుక్రవారం.. మనిషి మారాడు అంతే.. చంద్రబాబు హయాంలోనే ధూళిపాళ్లపై హైకోర్టులో కేసులు

శుక్రవారం వస్తుందంటే చాలు.. ఎవరి లోపలేస్తారో.. ఎవరిని అరెస్ట్ చేస్తారో అనే భయంతో చచ్చిపోతున్నాం.. ఇదెక్కడి ప్రభుత్వం అండీ.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. కొన్నాళ్లు క్రితం అన్న మాటలు.. ఇప్పుడు అక్షర సత్యం అయ్యాయి. ఏ ముహూర్తన ఈ మాట అన్నారో.. అప్పటి నుంచి వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి టీడీపీకి.

ఈసారి మాత్రం బ్యాడ్ టైం అన్ని రకాలుగా కలిసి రావటం అంటే ఇదే.. టీడీపీకి అచ్చిరాని 23వ తేదీనే.. అందులోనూ శుక్రవారం నాడే.. టీడీపీ మోస్ట్ సీనియర్ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏడాదికి వెయ్యి కోట్ల టర్నోవర్ జరిగే సంగం డెయిరీని.. నిబంధనలకు విరుద్ధంగా ప్రొడ్యూసర్ సంస్థగా మార్చటం వెనక కుట్ర ఉందని గతంలోనే హైకోర్టులో కేసులు పడ్డాయి. ఆ విషయంపై ఇప్పుడు నరేంద్రను అరెస్ట్ చేశారు పోలీసులు.

కాకపోతే ఈ శుక్రవారం.. ఈ 23వ తేదీ ఒకరు అనుకుంటే మరొకరు అరెస్ట్ అయ్యారు. సీఐడీ కేసులో ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్ అవుతారు అనుకుంటే.. ఆయన హైకోర్టుకు వెళ్లి ఊరట పొందారు. డేట్, వీక్ మారలేదు కానీ.. మనిషి మారాడు. ఈసారి ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అయ్యాడు.

ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి.. ఇటీవలే ఓ మీడియాలో మాట్లాడిన ధూళిపాళ్ల నరేంద్ర.. నా చిటికిన వేలుపై బొచ్చు కూడా పీకలేరు.. ఏం పీకుతారో పీక్కోండి అన్నాడు.. నా బొచ్చులో రాలిపోయిన వెంట్రుక కూడా పట్టుకోలేరు అంటూ పెద్ద సవాల్ విసిరారు. కాకపోతే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే.. సంగం డెయిరీపై హైకోర్టులో చాలా కేసులు పడ్డాయి.

ఆ కేసుల విషయంలో ఇప్పుడు యాక్షన్ జరిగింది.. ఏ బాధ పడకండీ.. ఆల్ మోస్ట్ సాయంత్రానికి ఊరట దొరకచ్చు అనే ధీమాలో ఉన్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు