దిశను మించిన ఘటన.. హైదరాబాద్ శివార్లలో మరో దారుణం

హైదరాబాద్ ఘట్కేసర్ పరిధిలో బీ ఫార్మసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. కళాశాలకు వెళ్లి వస్తున్నా విద్యార్థిని బస్సు దిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. తన స్టేజి రాగానే ఆపమని ఆటో డ్రైవర్ కు తెలిపింది. అయితే అతడు అంతే ఆపకుండా వెళ్ళిపోయాడు. ఆటోను ఘాట్ కేసర్ తీసుకెళ్లాడు.. ఈ సమయంలోనే విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దింతో వారు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు, సైరన్లు వేసుకుంటూ బయలుదేరారు.

ఘాట్ కేసర్ పరిసర ప్రాంతం మొత్తం పోలీసుల సైరన్ల మోతతో మోగిపోయింది. దింతో స్థానికులు ఆందోళన చెందారు. పోలీస్ సైరన్లు విన్న దుండగులు యువతిని మరో వ్యాన్ లో ఎక్కించారు. మొత్తం నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. ఈ సమయంలోనే ఆమె ప్రతిఘటించడంతో దాడి చేశారు. దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. ఆమె వస్త్రాలను చింపేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వాహనాల సౌండ్ అధికమవడంతో దుండగులు ఆమెను అన్నోజిగూడ పార్క్ దగ్గర పొదల్లో పడేసి వెళ్ళిపోయాడు.

వెంటనే ఆమెను చూసిన ఓ ఎస్ఐ ఆమెను భుజంపై వేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే నిందితుల్లో ఒకడైన ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు సమాచారం. ఆమె మాట్లాడలేకపోతుందని పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం డాక్టర్లు నిర్దారించనున్నారు. ఇక నిందితులను గుర్తించేందుకు పది బృందాలు రంగంలోకి దిగాయి.

దిశను మించిన ఘటన.. హైదరాబాద్ శివార్లలో మరో దారుణం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు