ఏపీలో డిసెంబర్ 25న క్రిస్ మస్ రోజున ఇళ్ల పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ పూర్తయిన వెంటనే.. అదే రోజు ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలుపెట్టాలని

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ిళ్ల పట్టాల పంపిణీని తిరిగి చేపట్టాలని డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ రోజున.. 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టాలని.. అందుకు అన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.

డి ఫామ్ పట్టా ఇచ్చి.. ఇంటి స్థలం కేటాయించనున్నారు.

మహిళల పేరుతో పట్టా ఇవ్వనున్నారు.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 లక్షల 68 వేల 281 లబ్ధిదారులను గుర్తించారు
డిసెంబర్ 25వ తేదీన పట్టాల పంపిణీ పూర్తయిన వెంటనే.. అదే రోజు ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలుపెట్టాలని నిర్ణయించింది ఏపీ సర్కార్

తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి.. వాటిని ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు