అయ్యప్ప భక్తులకు డాక్టర్ల సూచన – చన్నీళ్ల స్నానం చేయొద్దు

ఇన్నాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించారో.. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు కూడా వాటినే

కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. అయ్యప్ప మాలధారణ సంఖ్య అమాంతం పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే లక్షల మంది భక్తులు ప్రతి ఏటా అయ్యప్ప స్వామి దర్శనం కోసం కేరళ వెళతారు. స్వామి దర్శనంతో అనుకున్నది జరుగుతుందని విశ్వాసం. ఒక్కో భక్తులు పదుల సంఖ్యలో మాలధారణ చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఈసారి మాత్రం కరోనాతో అయ్యప్ప భక్తులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు డాక్టర్లు.
ఉదయం, సాయంత్రం చన్నీళ్ల స్నానం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని.. వేడి నీళ్లతో స్నానం చేయాలని సూచిస్తున్నారు.

చల్లని ప్రదేశాల్లో, చల్లని నీటిలో వైరస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వైరస్ దరి చేరకూడదు అంటే.. వైరస్ వ్యాప్తిని అరికట్టాలి అంటే వేడి నీళ్ల స్నానంతోపాటు అందులో డెటాల్ వంటి క్రిమిసంహార రసాయనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు.
వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని.. కింద పడుకోవటం వల్ల ఇబ్బందులు వస్తాయని సూచిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ఇన్నాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించారో.. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు కూడా వాటినే కొనసాగించాలని.. ఆరోగ్యం రీత్యా ఇది ఉత్తమం అని సూచిస్తున్నారు వైద్యులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు