రిపోర్టర్‌ మైక్‌ లాక్కొని కుక్క పరుగో పరుగు

జర్నలిస్ట్ ఫీల్ అంటే ధైర్యసాహసాలతో కూడుకుంది. రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఎటు నుంచి వస్తారో తెలియదు. కొన్ని కొన్ని సార్లు రిపోర్టింగ్ చేసే సమయంలో ప్రమాదాలకు గురై మృతిచెందిన జర్నలిస్టులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ జరిగింది వేరేలా ఉంది. ఓ మహిళా జర్నలిస్ట్ లైవ్ కవర్ చేస్తుంది. ఇదే సమయంలో అక్కడికి ఓ కుక్క వచ్చింది. ఆమె చేతిలో ఉన్న మైక్ లాక్కుని పరుగు తీసింది. ఎదురుగ ఉన్న కెమెరా మ్యాన్ కుక్కను పెట్టుకోకుండా వీడియో తీయడంతో ప్రస్తుతం ఈ దృశ్యాలు బయటకు వచ్చాయి.

కాగా ఈ ఘటన రష్యాలో జరిగింది. వీడియోలో ఉన్నది మిర్ టీవీ వెదర్ రిపోర్టర్ నాడెజ్దా సెరెజ్కిన అంటూ వాతావరణ విశేషాలు చెప్పడానికి సిద్ధం అవుతుండగా ఇంతలో ఓ కుక్క ఆమె చేతుల్లోని మైక్రోఫోన్ లాక్కుంది. ఒక్కసారిగా కుక్క వచ్చి మీద పడటంతో ఆమె బయపడింది.. ఇంతలోనే కుక్క మైక్ నోట కరిచి తీసుకోని వెళ్ళిపోయింది. ఈ సంఘటన జరగాన్నే లైవ్ లో ఉన్న యాంకర్ లైవ్ కట్ చేశారు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది.

రిపోర్టర్‌ మైక్‌ లాక్కొని కుక్క పరుగో పరుగు

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు