ట్రంప్ కు విడాకులు ఇచ్చేందుకు సిద్దమైన భార్య మెలానియా ట్రంప్

ట్రంప్ కు విడాకులు ఇచ్చేందుకు సిద్దమైన భార్య మెలానియా ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య ఆయనకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు గత కొద్దీ రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి.. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కీలక విషయాలు బయటకు వచ్చాయి, ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఓమరోసా న్యూమ్యాన్ వెల్లండించినట్లు అమెరికాలోని డెయిలీ మెయిల్ మెల్లడించింది.

ట్రంప్ కు విడాకులు ఇచ్చేందుకు మెలానియా ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ట్రంప్ మాటకోసమే ఆమె ఎదురుచూస్తుందని తెలిపారు. వారిద్దరూ భార్యాభర్తలు అయినప్పటికీ వారి మధ్య బంధం సరిగా లేదని ఆమె తెలిపారు. అవసరం కోసం ఆలా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఇక మెలానియా ట్రంప్‌ కి విడాకులు ఇస్తే ట్రంప్ బారి స్థాయిలో భరణం చెల్లించాల్సి ఉంటుంది. 68 అమెరికా మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

అంటే భారత కరెన్సీలో ఇది 500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది.  కాగా వీరిద్దరికి 15 ఏళ్ళక్రితం కాంట్రాక్టు పెళ్లి చెరిగింది. వీరికి 14 ఏళ్ల కుమారుడు బారన్ ట్రంప్ ఉన్నారు. ఇక గతంలోనే ట్రంప్ కు రెండు పెళ్లిళ్లు జరిగాయి.. మెలానియా ట్రంప్ తో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు ట్రంప్. ఇక మొదటి భార్యకు భరణంగా 14 మిలియన్ డాలర్లు చెల్లించగా, రెండో భార్యకు 2 మిలియన్ డాలర్లు భరణం చెల్లించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు