డ్రంక్ అండ్ డ్రైవ్ లో 30 వేల మంది పట్టుబడ్డారు – బార్లు, పబ్స్ పక్కనే మాటు వేస్తున్న పోలీసులు

తప్పించుకునే ఛాన్స్ లేకుండా పట్టుకుని లోపల వేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే

హైదరాబాద్ లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ హడలెత్తిస్తోంది. గల్లీల్లోనూ డ్రైవ్ నిర్వహిస్తూ.. తాగినోళ్లను పట్టుకెళ్లి జైళ్లల్లో వేస్తున్నారు. బార్లు, పబ్స్ ఎక్కడ ఉంటాయో వాటికి సమీపంలోనూ పోలీసులు డ్రైవ్ నిర్వహిస్తూ తాగినోళ్ల మత్తు దించుతున్నారు. వీధివీధిలో వెలిసిన వైన్ షాపులు, బార్లతో.. సామాన్యులు, మధ్య తరగతి ప్రజల బలహీనతతో ఆయా వర్గాల ప్రజలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయి మానసికంగా చితికిపోతున్నారు.

2019 ఒక్క ఈ సంవత్సరంలోనే అక్షరాల 29 వేల 756 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికారు. వీరిలో కొందరు జరిమానాలు కట్టి బయటకు వస్తే.. మరికొందరు జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి వచ్చారు. 2019 సంవత్సరంలోనే 18 వేల మంది వరకు జైలుకు వెళ్లారు. వీళ్లు చేసింది తాగి బండి నడపటమే.

మందు కొట్టి వాహనం నడపటం తప్పేకానీ.. ఏం చేస్తారు.. ప్రభుత్వం మాత్రం గల్లీగల్లీకి వైన్ షాపు, బార్లకు అనుమతి ఇచ్చింది ఎవరు అనేది కూడా ప్రశ్న. టీవీ5 ఛానల్ యాంకర్ సాంబశివరావు అన్నట్లు.. మందు తాగి బండి నడపటం తప్పయితే అది ముమ్మాటికీ ప్రభుత్వం తప్పే అని.. పాపం వేలాది మంది జైలు శిక్షతో మానసిక క్షోభకు గురయ్యారు. కుటుంబాల్లో చిత్రవధ అనుభవిస్తున్నారు. ప్రభుత్వానికి డబుల్, ట్రిబుల్ ట్యాక్ కట్టిన పాపానికి జైలు శిక్ష అనుభవించి.. కుటుంబాల ముందు దోషిగా నిలబడ్డారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు తమదైన శైలిలో డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ డ్రైవ్స్ కాకుండా ఎప్పుడుపడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ మాటు వేసి మరీ పట్టుకుంటున్నారు. వెంటాడి.. వేలాడి మరీ పట్టుకుంటున్నారు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా పట్టుకుని లోపల వేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వెంటే వాహనం సీజ్.. ఆ తర్వాత కోర్టులు.. మళ్లీ వాహనం తీసుకోవటానికి మరో రోజు.. ఇలా వారం, పది రోజులు నరకం అనుభవిస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చట్టరీత్యా నేరం.. అందుకే బీ అలర్ట్. ఎవరూ మందు కొట్టి వాహనం నడపొద్దు. మానసిక క్షోభకు గురి కావొద్దు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు