యాచకుడిగా మారిన డీఎస్పీ.. కారణం ఇదే

యాచకుడిగా మారిన డీఎస్పీ.. కారణం ఇదే

ఆయన పోలీస్ అధికారి, పరిష్టితిలు ఆయనకు యాచకుడిగా మార్చాయి. యాచకుడిగా మారిన 15 ఏళ్ల తర్వాత ఆయనో డీఎస్పీ అనే విషయం తెలిసింది.. అదికూడా తన బ్యాచ్ పోలీస్ అధికారి ద్వారా.. ఇక వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణంలో ఫుట్ పాత్ పై ఓ యాచకుడు చలికి ఒణుకుతున్నాడు. అటుగా వెళ్తున్న డీఎస్పీ రత్నేష్ సింగ్ తోమర్ అతడిని చూసి కారు ఆపాడు.

అతని దగ్గరికి వెళ్లి తన చలికోటు ఆ యాచకుడికి ఇచ్చాడు.. అతడితో మాట మాట కలిపాడు. ఆలా మాట్లాడుతుండగా ఆయన ఓ పోలీస్ అధికారి అని తెలిసింది.. అతడు తన బ్యాచ్ కు చెందిన మనీష్ మిశ్రాగా గుర్తించారు రత్నేష్ సింగ్. వెంటనే అతడిని తిసుకేల్లో ఓ స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న మహాసిక రోగుల ఆసుపత్రిలో చేర్చారు.

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

అయితే 1999 బ్యాచ్ కు చెందిన మనీష్ మిశ్రా డీఎస్పీగా పలు స్టేషన్లలో పనిచేశారు. 2005 చివరిగా దతియాలో పనిచేశారు. దతియాలో పనిచేస్తున్న రోజుల్లోనే అతడి ఆరోగ్యం పరిస్థితిలో మార్పులు వచ్చాయి. మానసిక పరిస్థితి దిగజారింది. దింతో ఇంట్లోవారు ఆయనకు పలు ఆసుపత్రులలో చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే మనీష్ మిశ్రా ఏటో వెళ్లిపోయారు. ఆయనకు కోసం చాలా రోజులు గాలించారు..

తర్వాత ఆశవదులుకున్నారు. మానసిక స్థితి బాగాలేని డిఎస్పీ మనీష్ మిశ్రా యాచకుడిగా మారిపోయాడు. 15 ఏళ్ల తర్వాత ఆయన ఆచూకీ తెలియడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు