ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఈటెల రాజేందర్ గ్యాంగ్.. 3 రోజుల భారీ యాక్షన్ ప్లాన్

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఈటెల రాజేందర్ గ్యాంగ్.. 3 రోజుల భారీ యాక్షన్ ప్లాన్

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఈటెల రాజేందర్ గ్యాంగ్.. 3 రోజుల భారీ యాక్షన్ ప్లాన్

టీఆర్ఎస్ మాజీ లీడర్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత.. బీజేపీలో జాయిన్ కావటం అందరికీ తెలిసిందే. బీజేపీలో చేరికను చాలా గ్రాండ్ గా.. భారీ హంగామాతో చేయాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీలో అడుగు పెట్టే వరకు.. అక్కడి నుంచి బీజేపీ కండువా కప్పుకునే వరకు.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చే వరకు.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సిటీలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి అడుగు పెట్టే వరకు అంతా గ్రాండ్ గా ఉండాలని డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టుగా మూడు రోజుల భారీ యాక్షన్ ప్లాన్ తయారు చేశారు.

2021, జూన్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలో వెళుతున్నారు. ఈటెల రాజేందర్ తోపాటు ఓ 20 మంది నేతలు, మరికొంత మంది బీజేపీ లీడర్స్ అందరూ కలిసి 40 మంది వరకు ఢిల్లీ వెళుతున్నారు. సాధారణ విమానంలో వెళితే కిక్ ఏముంటుందీ అనుకున్నారో ఏమో.. స్పెషల్ ఫ్లయిట్ లో ఢిల్లీకి వెళుతున్నారు.

సోమవారం ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటెలతోపాటు 20 నేతలు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. వీళ్లందరూ నడ్డా సమక్షంలోనే బీజేపీ సభ్యత్వం సైతం స్వీకరిస్తారు. ఢిల్లీలో ఈ వేడుక ముగిసిన వెంటనే.. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు.

బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత.. ఎయిర్ పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా.. బీజేపీ ఆఫీసుకు వెళ్లనున్నారు.

హైదరాబాద్ లోనే బీజేపీ ఆఫీసులో మొదటి సారి బీజేపీ పార్టీ నుంచి తన ప్రెస్ మీట్ ఉండబోతుంది. ఆ ప్రెస్ మీట్ లో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టనున్నట్లు సమాచారం.

మంగళవారం హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ వెళ్లి నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి.. నియోజకవర్గం నేతలు, కార్యకర్తలను బీజేపీలోకి ఆహ్వానించి.. కాషాయ కండువా కప్పనున్నారు.

మూడు రోజుల భారీ యాక్షన్ ప్లాన్ పక్కాగా ప్లాన్ చేశారంట ఈటెల రాజేందర్.. స్పెషల్ ఫ్లయిట్.. మందీ మార్బలం చూస్తుంటే.. రాజకీయంగా కొంచెం దూకుడు పెంచినట్లే కనిపిస్తోంది ఈటెల రాజేందర్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు