Eatala Rajender: మరో పదవికి ఈటల రాజీనామా

Eatala Rajender: మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ మరో పదవికి రాజీనామా చేశారు. తాజాగా మంత్రి పదవి నుంచి ఈటలను భర్తరఫ్ చేశారు. ఆ తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.

అయితే ప్రస్తుతం ఈటల ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీగా ఉన్నారు. 2014 నుంచి ఈటలనే దీనికి సెక్రెటరీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తను ఈ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీకి పంపించారు. త్వరలో సొసైటీ పాలకమండలి సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ రాజీనామా ఆమోదం అయితే ఈ పదవిని కేటీఆర్ చేపడతారని సమాచారం. ఇక మంత్రిగా కొనసాగుతున్న ఈటలపై భూ అక్రమాల ఆరోపణులు రావడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోయారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు