రూ. 10 వేల వరద సాయం నిలిపివేత – ఇందులో ఆశ్చర్యకరమైన ట్విట్

వరద సాయానికి - ఎన్నికల కోడ్ కు సంబంధం లేదని కమిషనర్ పార్థసారధి తెలిపారు. నగదు రూపంలో

హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు అందించే 10 వేల రూపాయల వరద సాయం నిలిపివేయాలని.. దరఖాస్తుల స్వీకరణ కూడా వెంటనే ఆపేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల తీసుకోవటం.. వాటిపై నగదు పంపిణీ చేయటాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత యథావిథిగా దరఖాస్తుల స్వీకరణ, 10 వేల సాయం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎస్ఈసీ. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరద సాయానికి బ్రేక్ పడింది.

విశేషం ఏంటంటే.. బుధవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో.. వరద సాయానికి – ఎన్నికల కోడ్ కు సంబంధం లేదని కమిషనర్ పార్థసారధి తెలిపారు. నగదు రూపంలో ఇవ్వకూడదు అని.. బ్యాంక్ ద్వారా 10 వేల నగదు ఇస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పటం.. వరద సాయాన్ని నిలిపివేయటం చర్చనీయాంశం అయ్యింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు