టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు.. వెయ్యి కోట్ల స్కాం.. విదేశాలకు నిధులు తరలింపు

టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు.. వెయ్యి కోట్ల స్కాం.. విదేశాలకు నిధులు తరలింపు

టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు.. వెయ్యి కోట్ల స్కాం.. విదేశాలకు నిధులు తరలింపు

టీఆర్ఎస్ పార్టీ.. ఖమ్మం లోక్ సభ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ సోదాలు చేస్తోంది. వెయ్యి కోట్లకుపైగా బ్యాంకులను మోసం చేసిన కేసులో విచారణ చేస్తోంది. 2021, జూన్ 11వ తేదీ ఉదయం చెన్నై, ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు.. ఇంట్లో తనిఖీలు చేస్తున్నాయి. ఖమ్మం, హైదరాబాద్ లోని నామా ఇళ్లల్లో, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు.. కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

గతంలో నామా నాగేశ్వరరావు మధుకాన్ ప్రాజెక్ట్స్ పేరుతో కంపెనీలు పెట్టి.. వివిధ బ్యాంకులను అప్పులు తీసుకున్నారు. ఒక్క వెయ్యి 64 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించినట్లు గుర్తించారు అధికారులు. ఈ విధంగా తీసుకున్న వెయ్యి కోట్లను విదేశాలకు తరలించినట్లు గుర్తించారు అధికారులు.

రెండేళ్లుగా ఈ నిధులకు సంబంధించి అనేక సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. మరోవైపు మధుకాన్ కంపెనీ పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను సైతం చెల్లించలేదు. ఈ క్రమంలోనే ఆయన ఇంట్లో ఈడీ ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి.

విశేషం ఏంటంటే.. బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులను విదేశీ కంపెనీలకు తరలించినట్లు ఎప్పుడో గుర్తించిన అధికారులు.. ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది ప్రశ్న. మరోవైపు విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఏయే దేశాలకు.. ఏయే కంపెనీలకు ఈ నిధులు వెళ్లాయనేది బయటపెట్టటం లేదు.

నామా నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు