ఆ రూ.10 లక్షలతోనే ఈటెల విశ్వసనీయత ఆధారపడి ఉందా..

ఆ రూ.10 లక్షలతోనే ఈటెల విశ్వసనీయత ఆధారపడి ఉందా..

eerala raitu bandu.jpg
eerala raitu bandu.jpg

టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్.. రైతు బంధు విషయంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. బెంజ్ కార్లలో వచ్చే వాళ్లకు రైతు బంధు ఎందుకు.. పేదలకు ఇవ్వొచ్చు కదా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించినందుకే నన్ను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఓ లిస్ట్ ఆయన్ను షాక్ కు గురి చేసింది. తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తుంది.

బెంజ్ కార్లలో వచ్చి రైతు బంధు డబ్బులు తీసుకెళ్లిన వారిలో ఈటెల రాజేందర్ ఫ్యామిలీ ఉండటం విశేషం. 2018 నుంచి ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ ఫ్యామిలీ రైతు బంధు కింద 10 లక్షల 23 వేల రూపాయలను ప్రభుత్వం నుంచి తీసుకున్నది. ఈటెల రాజేందర్ భార్య జమున, కుమారుడు, కుమార్తె పేరుపై ఈ 10 లక్షలను చెల్లించింది ప్రభుత్వం.

ఈటెల రాజేందర్ రాజకీయాల్లోకి రాకముందే కోటీశ్వరుడు. తెలంగాణలోనే అతిపెద్ద ఫౌల్ట్రీ ఫాంలు నిర్వహిస్తూ.. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. మంత్రి హోదాలో ప్రభుత్వం ఫార్చూన్ కార్లు ఇస్తుంటే.. సొంతంగా నాలుగు, ఐదు బెంజ్ కార్లు ఉన్నాయి. ఇంటిల్లపాదీ కాస్ట్లీ కార్లలో తిరుగుతుంటారు.. అలాంటి ఈటెల రాజేందర్.. బెంజ్ కార్లలో తిరిగే వారికి రైతుబంధు ఎందుకు అని కామెంట్ చేయటం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నేతలు.

రైతు బంధు కింద తన ఫ్యామిలీ తీసుకున్న 10 లక్షల రూపాయల సంగతి ఏంటీ అని కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇప్పుడు ఈటెల విశ్వసనీయ ఈ 10 లక్షల రూపాయలతో ముడిపడి ఉంది. దీన్ని ఎలా సమర్థించుకుంటారు అనేది ఆయనే చెప్పాలి.

ఒకవేళ 10 లక్షలు తిరిగి చెల్లిస్తే.. విమర్శలు వచ్చాయి కాబట్టి తిరిగి ఇచ్చేస్తున్నారు.. అదే మంత్రిగా ఉండి ఉంటే ఎప్పటికీ 10 లక్షల ఇవ్వకపోగా.. ప్రతి ఏటా రైతుబంధు డబ్బులు తీసుకునేవారే కదా అనే విమర్శలు వస్తాయి. ఇవ్వకపోతే.. వందల కోట్ల వ్యాపారం చేస్తూ.. రైతు బంధుపైనే విమర్శలు చేసిన ఆయన.. ఆ మాత్రం 10 లక్షలు తిరిగి ఇచ్చేస్తే బాగుండేది అనే పాయింట్ రైజ్ అవుతుంది.

ఈ విధంగా ఈటెల రాజేందర్ తాను ఎత్తిన పాయింట్ దగ్గరే.. ఈ విధంగా ఇరక్కపోయారు. ఈ 10 లక్షల రూపాయలపైనే ఈటెల విశ్వసనీయ ఆధారపడి ఉంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు