కాంగ్రెస్ ఓడినా పర్వాలేదు.. ఈటెల గెలవాలి.. ఇదేనా రేవంత్ రెడ్డి తొలి వ్యూహం

కాంగ్రెస్ ఓడినా పర్వాలేదు.. ఈటెల గెలవాలి.. ఇదేనా రేవంత్ రెడ్డి తొలి వ్యూహం

కాంగ్రెస్ ఓడినా పర్వాలేదు.. ఈటెల గెలవాలి.. ఇదేనా రేవంత్ రెడ్డి తొలి వ్యూహం

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో రచ్చ మొదలైంది. దీనికి కారణం అక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కావటమే. టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఈటెల.. రాజీనామా చేసి బీజేపీలో చేరి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ – బీజేపీ – కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడ గెలవటం ఎంతో ముఖ్యం.

బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న ఈటెల రాజేందర్ ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. అసలు ఇంట్లోనే ఉండటం లేదు. రోజూ ఏదో ఒక గ్రామం వెళుతున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. నియోజకవర్గంలో గెలుపు అనేది ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్ ను నిర్దేశిస్తుంది. అదే విధంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ గా భావిస్తోంది బీజేపీ. అందుకే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ కు ఏకంగా పాదయాత్ర చేపడుతున్నారు.

ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఉత్తర తెలంగాణలో బలంగా పార్టీ ఉందని చెప్పుకోవటంతోపాటు.. ఈటెల రాజేందర్ ను ఓడించటానికి సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈటెల గెలిస్తే తనపై చేసిన ఆరోపణలు, విమర్శలు అన్నీ అబద్ధం అని తేలిపోతాయి. పార్టీ బలం కంటే ఈటెల బలం ఎక్కువ అని జనంలోకి సంకేతాలు వెళితే.. ప్రత్యర్థి పార్టీలు మరింత రెచ్చిపోతాయి. దీంతో హుజూరాబాద్ లో ఎలాగైనా గెలవాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు చెమటలు పట్టించిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకోబోతున్నది.

కాంగ్రెస్ పార్టీది విచిత్రమైన పరిస్థితి. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ఎదుర్కోబోతున్న తొలి సవాల్. అయితే హుజూరాబాద్ లో బలమైన లీడర్ గా ఉన్న కౌశిక్ రెడ్డి రాజీనామాతో.. ఇప్పుడు క్యాండెట్ ఎవరు అనేది సందేహం. దీనికితోడు ఎంత బలమైన నేతను బరిలోకి దింపినా.. కాంగ్రెస్ గెలుపు కష్టం కాబట్టి.. టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు.. పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు.. ఈటెల రాజేందర్ ను గెలిపించటం ద్వారా.. టీఆర్ఎస్ ఆత్మరక్షణలోకి నెట్టాలని భావిస్తుంది. ఇదే విషయాన్ని కౌశిక్ రెడ్డి సైతం ప్రస్తావించటం విశేషం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు