పార్టీ బలంగా ఉంటే.. ఈటెల మన దగ్గరకే వచ్చేవాళ్లు.. ఏదో ఒకటి తేల్చేయండి.. రేవంత్ అల్టిమేటం

పార్టీ బలంగా ఉంటే.. ఈటెల మన దగ్గరకే వచ్చేవాళ్లు.. ఏదో ఒకటి తేల్చేయండి.. రేవంత్ అల్టిమేటం

revanth and eetala
revanth and eetala

పార్టీ బలంగా ఉంటే.. ఈటెల మన దగ్గరకే వచ్చేవాళ్లు.. ఏదో ఒకటి తేల్చేయండి.. రేవంత్ అల్టిమేటం

తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ బయటకు రావటం.. బీజేపీలోకి వెళుతుండటంతో ఆ పార్టీకి జోష్ వచ్చింది. ఇదే సమయంలో పార్టీ రథసారధి ఎవరు అనే అంశంలోనూ మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరగటం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలోనే మరోసారి పీసీసీ చీఫ్ అంశం తెరపైకి వచ్చింది.

2021, జూన్ 4వ తేదీ గవర్నర్ ను కలిసి వచ్చిన తర్వాత.. ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు రాజ్ భవన్ సమీపంలోనే.. రోడ్డు పక్కన.. చెట్టు కింద ఓ ఐదు నిమిషాలు ప్రత్యేకంగా ముచ్చటించుకున్నారు. ఈ సమయంలో పీసీసీ చీఫ్ అంశంలో అధిష్టానం వైఖరి వీరిద్దరి మధ్య చర్చకు వచ్చింది. ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఓకే అన్నట్లు విలేకరుల ఎదుట మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. ఈసారి మాత్రం తన మనసులోని మాట ఓపెన్ గా చెప్పేశారంట.

వెంకటరెడ్డి అన్నా.. ముసుగులో గుద్దులాట ఎందుకు.. ఎన్నాళ్లు ఇలా నాన్చుడు చేస్తారు.. పీసీసీ చీఫ్ ఇస్తామంటే ఇవ్వండి.. లేదంటే లేదు అని చెప్పేయొచ్చు.. అలా కాకుండా ఇలా నాన్చుతూ ఎన్నాళ్లు నెట్టుకొస్తారు.. ఓ వైపు నాకు ఇస్తే ఏదో జరిగిపోతుందంటూ వృద్ధ నేతలు అందరూ వారానికి ఓ సారి ప్రెస్ మీట్లు పెట్టి ఓవరాక్షన్ చేయటం.. ఇదంతా ఏం బాగోలేదు.. ఇలా అయితే పార్టీ కష్టం.. ఈటెల రాజేందర్ చాయిస్ కూడా బీజేపీ వైపే ఉంది.. కాంగ్రెస్ బలంగా ఉంటే.. ఆయన మన దగ్గరకే వచ్చేవారు.. ఈటెల వంటి నేత.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని.. బీజేపీ వైపు వెళ్లారంటే జనంలో పార్టీ బలం ఏంటో చెప్పకనే తెలుస్తుంది.. ఇప్పటికే అందరి అభిప్రాయాలు తీసుకున్న అధిష్టానం ఇప్పటి వరకు ఎటూ తేల్చలేదు.. మొన్నటి వరకు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అన్నారు.. అయిపోయి రెండు నెలలు అయ్యింది.. ఏంది ఇదంతా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదుట కుండబద్దలు కొట్టారంట రేవంత్ రెడ్డి.

ఈటెల రాజేందర్ వంటి లీడర్ ను కాంగ్రెస్ పార్టీ ఆకర్షించలేకపోయిందని.. ప్రజల్లోకి ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తుందని.. ఇలా అలా అయితే పార్టీ కష్టం అంటూ అసహనం వ్యక్తం చేశారంట రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి నేతలు చాలా మంది ఉన్నారని.. పార్టీ బల పడుతుంది అనే సంకేతాలు జనంలోకి తీసుకెళ్లగలిగితే.. బీజేపీ కాకుండా కాంగ్రెస్ వైపు రావటానికి సిద్ధంగా ఉన్నారని.. ఇప్పటికైనా ఏదో ఒకటి తేల్చేయండి అంటూ అల్టిమేటం ఇచ్చారు ఎంపీ రేవంత్ రెడ్డి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు