ఆత్మగౌరవం చంపుకుని షర్మిల పార్టీలో చేరను.. నాతో ఎవరూ మాట్లాడనే లేదు.. షర్మిల కామెంట్లపై ఈటెల కౌంటర్

ఆత్మగౌరవం చంపుకుని షర్మిల పార్టీలో చేరను.. నాతో ఎవరూ మాట్లాడనే లేదు.. షర్మిల కామెంట్లపై ఈటెల కౌంటర్

ఆత్మగౌరవం చంపుకుని షర్మిల పార్టీలో చేరను.. నాతో ఎవరూ మాట్లాడనే లేదు.. షర్మిల కామెంట్లపై ఈటెల కౌంటర్

ఆత్మగౌరవం కోసం తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ నుంచే బయటకు వచ్చిన వాడిని.. అలాంటిది ఆంధ్రా పార్టీ అయిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఎలా చేరతాను అంటూ స్పందించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నుంచి ఫోన్లు వచ్చాయని.. కానీ షర్మిల నుంచి అసలు ఫోన్ కూడా రాలేదని.. ఎవరూ టచ్ లో లేరని చెప్పుకొచ్చారు. అయినా ఆంధ్రా పార్టీలో ఎలా చేరతాను అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆత్మగౌరవం చంపుకుని షర్మిల పార్టీలో ఎలా చేరతాను అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఈటెల రాజేందర్ వస్తానంటే.. పార్టీలోకి ఆహ్వానిస్తాం అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై.. ఈటెల ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోపాటు చాలా మంది ఆహ్వానించారన్నారు. అయితే ఇప్పటి వరకు బహిరంగంగానీ.. ఫోన్ ద్వారాగానీ.. ఎవరూ మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. చేరతాను అంటే ఆహ్వానిస్తాను అంటూ ఆమెకు ఆమే ఎలా ప్రకటిస్తారని షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్.

ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్.. బీజేపీలో చేరిపోవటం కన్ఫామ్ అయినా.. ఏ తేదీన చేరతారు అనేది ఆసక్తిగా మారింది. చేరిక తర్వాత అతనికి ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి పదవులు దక్కనున్నాయో చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు