ముందు వెళుతున్న రైలును.. వెనక నుంచి మరో రైలు ఢీకొట్టింది

ఈజిప్టు దేశంలో రైలు ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొని 32 మంది చనిపోగా.. 100 మందిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. మార్చి 26వ తేదీ శుక్రవారం సాయంత్రం.. దక్షిణ ఈజిప్ట్ లోని సోహాగ్ ప్రావిన్స్ లో జరిగింది. వెళుతూ ఉన్న రైలును.. వెనక నుంచి మరో రైలు వేగంగా వచ్చి ఢీకొన్నది. రెండు రైళ్లలోని 24 బోగీలు పట్టాలు తప్పగా.. నాలుగు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి.

ఈజిప్టులో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదేళ్ల కాలంలో ఇది 25వ ప్రమాదం. వందేళ్ల క్రితం వేసిన పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా రైలు ప్రయాణం అంటేనే ఈజిప్ట్ ప్రజలు హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్వే వ్యవస్థలోని లోపాలపై ప్రయాణికులు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా.. అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదంటూ ఈ ప్రమాదం తర్వాత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

ఈజిప్ట్ రైలు ప్రమాదం చూసిన వారికి ఆశ్చర్యకరమైన డౌట్స్ వస్తున్నాయి. ఇదేమన్నా బస్సు ప్రమాదమా ఏంటీ అంటున్నారు. ముందు వెళుతున్న రైలును.. వెనక నుంచి మరో రైలు ఢీకొనటం ఏంటీ అంటున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలోని లోపాల వల్లే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాన్ని తలపించే విధంగా రైలు ప్రమాదం జరగటం విశేషం.

See Also : 2024లో ఈనాడు పేపర్ ప్రింటింగ్ నిలిపివేత – సోషల్ మీడియాలో జోరుగా చర్చ – ఇప్పటికీ కళ్లు తెరవకపోతే.. డిజిటల్ సైతం గోవిందా

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు