ఏలూరులో ఎం జరుగుతుంది.. అసలు అదేం జబ్బు

ఏలూరులో ఎం జరుగుతుంది.. అసలు అదేం జబ్బు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ వింత వ్యాధి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. గతంలో ఎక్కడ ఈ వ్యాధి రోగులు కనిపించకవాదంతో డాక్టర్లు వ్యాధి ఏంటి అనేది గుర్తించలేకపోతున్నారు. మూర్ఛలక్షణాలతో వస్తున్నా ఈ మహమ్మారి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే ఇది ఏదైనా కలుషత వాయువు పీల్చడం వలన వస్తుందా లేదంటే ఏదైనా కలుషిత ఆహారం తీసుకోవడం వలన వచ్చిందా అనేది తెలియడం లేదు.

ఇక శనివారం మూర్ఛ లక్షణాలతో కొందరు ఆసుపత్రిలో చేరారు. ఇక ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది సోమవారం ఈ వింతవ్యాది బారినపడిన వారి సంఖ్య 470కి చేరింది. వీరిలో 263 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే వ్యాధి లక్షణాలు మాత్రం మూర్ఛ వచినట్లుగానే ఉంది. కానీ ఒకేసారి అంతమందికి మూర్ఛరావడం అనేది పెద్ద ప్రశ్నగా మారింది వైద్యులు కూడా ఏమి తేల్చుకోలేకపోతున్నారు.

వ్యాధి లక్షణాలను బట్టి వైద్యులు మందులు ఇస్తున్నారు. ఈ వ్యాధి బారినపడిన వారు 24 గంటల్లో పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్తున్నారు. అయితే వీరికి మళ్ళి రాదు అనే గ్యారెంటీ మాత్రం వైద్యులు ఇవ్వడం లేదు. రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్, ఢిల్లీ పరీక్షా కేంద్రాలకు పంపారు.

 

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు