తిరుపతి పోలింగ్ కు సిబ్బంది కొరత – చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన ఎంప్లాయిస్

తిరుపతి పోలింగ్ కు సిబ్బంది కొరత - చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన ఎంప్లాయిస్

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ మరికొన్ని గంటల్లో.. అనగా ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాబోతున్న సమయంలో.. ఎన్నికల అధికారులకు ఊహించని షాక్ తగిలింది. కరోనా వచ్చిందంటూ.. 100 మందికిపైగా సిబ్బంది విధులకు డుమ్మా కొట్టారు. చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వటంతో అత్యవసరంగా మరొకరిని వెతికి పనిలో పడ్డారు ఉన్నతాధికారులు.

పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర సామాగ్రి తరలించటానికి అంతా సిద్ధం చేశారు. అయితే 100 మందికిపైగా సిబ్బంది రాలేదు. ఏంటా అని ఫోన్ చేస్తే కరోనా వచ్చింది అంటూ చెబుతున్నారు. మరికొందరు అయితే ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. కరోనా భయంతో కావాలనే విధులకు డుమ్మా కొడుతున్నారని గుర్తించిన ఉన్నతాధికారులు.. కరోనా వచ్చిందనే పరీక్ష రిపోర్టులు తర్వాత చూపించాలని.. లేకపోతే యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.

చివరి నిమిషంలో పోలింగ్ సిబ్బంది వంద మందికిపైగా డుమ్మా కొట్టటంతో.. ఇప్పటికిప్పుడు మరొకరిని తీసుకోవటానికి ఇతర శాఖల ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు అధికారులు. సాయంత్రంలోగా కొత్త సిబ్బందిని పోలింగ్ కేంద్రాలను తరలిస్తామని.. పోలింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

ముందస్తు సమాచారం లేకుండా.. చివరి నిమిషంలో ఒకేసారి వందల సంఖ్యలో సిబ్బంది హ్యాండ్ ఇవ్వటంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు