వైఎస్ అన్నప్పుడు కూడా బాధపడలేదు.. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావటం లేదు : ఈటెల కన్నీటి పర్యంతం

etela rajender over land issue

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఇది పదవి మాత్రమే కావొచ్చు.. కానీ ఈటెల రాజేందర్ కు అది ఆత్మ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పార్టీని తన భుజం మోశారు.. పార్టీని పెద్దది చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. టీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా.. పార్టీ గెలుపు కోసం కృషి చేశారు.

ఏ పార్టీలో పుట్టాడో.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పై.. ఆ పార్టీ కనుసన్నల్లోనే.. ఆ పార్టీకి మద్దతు తెలిపే న్యూస్ ఛానళ్లే ఇప్పుడు భూ కబ్జా అంటూ పెద్ద పెద్ద ఆరోపణలు, విమర్శలతో ఏకి పారేస్తున్నాయి.

2009లో కాంగ్రెస్ – టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లింది పార్టీ.. ఆ సమయంలో 10 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ.. 50 సీట్లు పోటీ చేసి.. పట్టుమని 10 సీట్లు గెలవలేదు.. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజేంద్ర.. 50 సీట్లు పోటీ చేసి.. 10 సీట్లు గెలిచి మాట్లాడటానికి సిగ్గు పడాలి రాజేంద్ర.. అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో అంటే.. మొత్తం తెలంగాణ సమాజం నోరెత్తింది..

ఈటెల రాజేందర్ తల ఎక్కడ పెట్టుకుంటావ్ అంటూ వైఎస్ఆర్ పై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడిగా.. సొంత పార్టీ నుంచి గెలిచి.. మంత్రిగా ఉన్న అతనిపైనే ఇప్పుడు భూ కబ్జా ఆరోపణలు రావటం చూసిన ఈటెల అభిమానులు, కార్యకర్తలు అవాక్కవుతున్నారు.

టీవీల్లో భూ కబ్జా ఆరోపణలు చూసిన మంత్రి ఈటెల రాజేందర్.. కన్నీటి పర్యంతం అయ్యారంట. పార్టీ నుంచి వెళ్లిపో అంటే వెళ్లిపోయేవాడిని.. అలా కాకుండా మరక వేసి పంపిస్తున్నారు.. టీఆర్ఎస్ పార్టీలోనే పుట్టాను.. అలాంటి పార్టీ నుంచే అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను అంటూ అనుచరుల దగ్గర బాధ వ్యక్తం చేశారంట రాజేందర్..

అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తల ఎక్కడ పెట్టుకుంటావ్ రాజేంద్రా అని అసెంబ్లీలో.. నిండు సభలో హేళన చేసినప్పుడు కూడా ఇంత బాధపడలేదు.. ఇప్పుడు అంత కంటే ఎక్కువ బాధపడుతున్నాను.. నిజంగా ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావటం లేదు అంటూ భావోద్వేగానికి గురయ్యాడంట ఈటెల రాజేందర్. నేను ఎలాంటి వాడినో.. ఎలా ఉంటానో.. నా వ్యక్తిత్వం తెలిసిన మీడియా వాళ్లే ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటూ అనుచరులు, కుటుంబ సభ్యుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారంట మంత్రి ఈటెల రాజేందర్.

See also : మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా.. రూ. 100 కోట్ల భూమి అంట.. ఆ ఒక్క టీవీలోనే బ్రేకింగ్

See also : మంత్రి ఈటలపై వేటుకు వేసేందుకు రంగం సిద్దం.. పొమ్మనలేక భూ కబ్జా పొగ పెట్టారా : మీడియా ముందస్తు ప్లాన్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు