ఈటెల రాజేందర్ కు.. వైఎస్ షర్మిలకు అదే తేడా.. కేసీఆర్ పాత ఫార్ములానే ఇంకా పట్టుకున్నారా ఏంటీ..

ఈటెల రాజేందర్ కు.. వైఎస్ షర్మిలకు అదే తేడా.. కేసీఆర్ పాత ఫార్ములానే ఇంకా పట్టుకున్నారా ఏంటీ..

ఈటెల రాజేందర్ కు.. వైఎస్ షర్మిలకు అదే తేడా.. కేసీఆర్ పాత ఫార్ములానే ఇంకా పట్టుకున్నారా ఏంటీ..

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతుంది.. నిన్నటి వరకు ఏం జరుగుతుందా అని చూసినోళ్లు.. ఇప్పుడు ఏంటీ ఇలా జరుగుతుంది.. ఈ ట్విస్టులు ఏంటీ.. ఇలా ఎలా ముందుకు వెళుతున్నారు అంటూ చిన్నగా మాటలు బయటకు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ వ్యవహారం.

ఈటెల రాజేందర్ పార్టీ పెడతారని జోరుగా ప్రచారం జరిగింది.. దీనిపై తుది నిర్ణయం ప్రకటించకపోయినా.. వరసపెట్టి ఆయన కలుస్తున్న లీడర్లను చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్కతో భేటీ.. ఇవాళ చూస్తే ఎంపీ డీఎస్ తో భేటీ.. ఆ వెంటనే బీజేపీ ఎంపీ ధర్మపురితో సమావేశం.. ఇలా ఈటెల అందరు ప్రముఖులను కలుస్తూ వస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతోళ్లను కలుస్తూ పోతున్నారు. ఇక్కడే ఎవరికీ ఏమీ అర్థం కావటం లేదు. ఈటెల పార్టీ పెట్టాలనుకుంటే మిగతా పార్టీల వాళ్లను ఎలా కలుస్తారు అనేది అంతుచిక్కని పాయింట్. వాళ్లు ఏమైనా పార్టీ మారే వాళ్లా అంటే అదీ కాదు.. బీజేపీ ఎంపీ అరవింద్ తో.. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయితే వాళ్లేమైనా ఈటెల పార్టీలోకి వస్తారా ఏంటీ అనే ప్రశ్నల తలెత్తుతున్నాయి.

ఈటెల వ్యవహారం చూస్తుంటే.. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్.. అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరుతూ వచ్చారు. సేమ్ టూ సేమ్ అలాగే ఇప్పుడు ఈటెల చేస్తున్నారు అంటున్నారు. అప్పుడంటే ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం.. ఇప్పుడు ఉద్యమం కాదు కదా.. రాజకీయ పార్టీ.. ఇప్పుడు వాళ్లు ప్రత్యర్థులు కదా అంటున్నారు. ఒక వేళ ఈటెల బీజేపీలోకో.. కాంగ్రెస్ పార్టీలోనో జాయిన్ కావాలి అనుకుంటే నేరుగా వెళ్లి జాయిన్ కావొచ్చు.. అలా కాకుండా అన్ని పార్టీల నేతలకు కలవటం ఏంటో అర్థం కావటం లేదు.

ఓ వైపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో వైఎస్ షర్మిల పార్టీ పెట్టారు.. సింగిల్ గా వచ్చారు.. పార్టీ నిర్మాణం అన్నారు.. భారీ సభ పెట్టారు.. విజన్ వివరించారు.. అందరూ ప్రత్యర్థులే అని ప్రకటించారు.. విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు.. ఇక పార్టీ బలోపేతానికి వాళ్లను, వీళ్లను పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు.. అప్పుడప్పుడూ జాయినింగ్స్ తో పార్టీకి బలం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీ చిన్నదో.. పెద్దదో షర్మిలలా ఉండాలి కానీ.. ఈటెల రాజేందర్ ఏంటో అందర్నీ ఎందుకు వెళ్లి కలుస్తున్నాడో ఎవరికీ అర్థం కావటం లేదు. అప్పట్లో కేసీఆర్ అంటే ఉద్యమం కాబట్టి.. అదో ప్రత్యక సందర్భంగా కాబట్టి వర్కవుట్ అయ్యింది.. ఇప్పుడు అలా కాదు కదా అంటున్నారు.. ఇంకా కేసీఆర్ పాత ఫార్ములానే పట్టుకున్నారా ఏంటీ ఈటెల అంటూ మిగతా పార్టీల్లోని నేతలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు