టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి సైతం ఈటెల రాజీనామా : కేసీఆర్ తో పూర్తిగా తెగతెంపులు..

తెలంగాణలో కరోనా తీవ్రంగా ఉంది.. మంత్రి ఈటెల అధికారిక ప్రకటన..

తెలంగాణ అనగానే ఆత్మగౌరవం, నిధులు, నియామకాలు, నీళ్లు అని అంటారు.. ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీలోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఈటెల రాజేందర్.. ఇప్పుడు అదే ఆత్మగౌరవంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు.. చేస్తారు కూడా. భూ కుంభకోణం ఆరోపణలపై సీఎస్ కాదు.. చీఫ్ జస్టిస్ తో విచారణ చేయించాలని సవాల్ చేసిన ఈటెల.. మంత్రి పదవిలో ఉండి విచారణ ఎదుర్కోవటం అంటే విమర్శలు, ఆరోపణలు ఇంకా వస్తాయి. సో.. మంత్రి పదవికి రాజీనామా చేస్తారు.. అది మే ఒకటో తేదీ లేదా రెండో తేదీ కావొచ్చు…

ఏ ఆరోపణలతో అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తారో.. దానికి కారణం అయిన పార్టీలో ఉండలేరు.. సో.. మంత్రి పదవితోపాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తారని ఈటెల రాజేందర్ అనుచరులు, ఆప్తులు స్పష్టం చేశారు. ఇక నుంచి టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండానే రాజకీయం ఉంటుందని వెల్లడించిన అతని అభిమానులు.. సీఎం కేసీఆర్ తో.. ఆ కుటుంబంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోబోతున్నారని వివరించారు.

ఆలస్యం చేయకుండా అన్నీ చకచకా జరిగిపోతాయని భావించటం లేదని.. వారం, 10 రోజుల గ్యాప్ లో అన్ని సర్దుకుంటాయని చెబుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన వైఖరితో ఉన్నామని.. హడావిడిగా, మీడియా హైప్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోం అని.. గ్రామస్థాయిలో మంత్రి ఈటెలకు మంచి పట్టు ఉందని.. సామాజిక వర్గం పరంగానే పలుకుబడి ఉన్న వ్యక్తి అని చెబుతున్నారు ఈటెల వర్గీయులు.

టీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులు చేసుకున్న తర్వాతే వేయాల్సిన అడుగులు జాగ్రత్తగా ఉండాలని.. ఎవర్ని కలుపుకుని పోవాలి.. ఎవరితో యుద్ధం చేయాలి అనే విషయంపై క్లారిటీగా ముందుకు సాగాలనే యాక్షన్ ప్లాన్ లో ఉన్నారు ఈటెల రాజేందర్.

See also : సూపర్ సీఎం కేసీఆర్ : మంత్రిగా ఈటెల బర్తరఫ్.. 24 గంటల్లోనే భూ కబ్జా కేసు తేల్చేశారు.. జెట్ స్పీడ్

See also : ఈటెల పార్టీ పెడతారా -బీజేపీలోకి వెళతారా : టచ్ లోకి వెళ్లిన కొండా విశ్వేశ్వరరెడ్డి

See also : ఈటెల అన్నది మంత్రి మల్లారెడ్డి గురించే కదా.. ఆయనకు ప్రత్యేక న్యాయమా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు