Ethiopia Air Strike: వైమానిక దాడిలో 80 మంది మృతి..

Ethiopia Air Strike: ఇథియోపియాలో మారణహోమం జరిగింది. మార్కెట్ పై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 80 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరికొందరు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర టిగ్రే ప్రాంతంలో ఉన్న టొగొగా గ్రామంలోని ఓ మార్కెట్ పై దాడి చేశారు. రద్దీగా ఉన్న సమయంలో దాడి జరగడంతో ప్రాణనష్టం అధికంగా జరిగినట్లు తెలుస్తుంది.

ఇక ఈ వైమానిక దాడిలో 100 మందివరకు గాయపడినట్లు సమాచారం. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. పైనుంచి వెళ్తున్న ఓ విమానం లోంచి బాంబులు జారవిడిచినట్లు గాయపడినవారు చెబుతున్నారు. దాడిలో గాయపడిన కొంతమంది మేకెలెలోని ఐడర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

2020 నవంబర్ నుంచి ఇథియోపియా సైనికులకు, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్ఎఫ్) తిరుగుబాటు దళాలకు మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. ఇక దాడి జరిగిన ప్రదేశం వద్దకు వైద్యులను అంబులెన్సులను అమనుమతించడం లేదు సైన్యం.. దీంతో తీవ్రంగా గాయపడినవారు అక్కడే ప్రాణాలు విధించినట్లు తెలుస్తుంది.

సమాయకచర్యలు నడుస్తున్న సమయంలో కూడా దాడులు చేసే అవకాశం ఉండటంతో వైద్యులను అనుమతించడం లేదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. తమ వాహనాల్లోనే గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చుతున్నట్లుగా వివరించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు