బార్లు, పబ్స్, ధియేటర్లు, రెస్టారెంట్లు ఆల్ ఓపెన్.. హ్యాపీ ఎంజాయ్ హైదరాబాదీస్

తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసింది. కరోనా ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ఎలాంటి కార్యకలాపాలు జరిగాయే.. అదే స్థాయిలో మళ్లీ వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. 2021, జూన్ 19వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ ప్రగతిభవన్ లో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణయానికి కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు.

లాక్ డౌన్ ఎత్తివేశారు కదా వాటికి కూడా పర్మీషన్ ఇచ్చారా అని అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చూస్తున్న వారికీ శుభవార్త అందించింది ప్రభుత్వం.

జూన్ 20వ తేదీ అంటే ఆదివారం నుంచి బార్లు, పబ్స్, రెస్టారెంట్లు అన్నీ ఓపెన్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది ప్రభుత్వం.

ఇక సినిమా హాళ్లు, మాల్స్ ఓపెన్ చేసుకోవచ్చని ఆదేశిస్తూనే.. కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. ధియేటర్లకు వచ్చే ప్రేక్షకుల మధ్య బౌతిక దూరం ఉండాలని స్పష్టం చేసింది.

రెస్టారెంట్లు అన్నీ యధావిధిగా నడుపుకోవచ్చని.. సీటింగ్ ఉన్న రెస్టారెంట్లలో సామాజిక దూరం కంపల్సరీ అని స్పష్టం చేసింది.

పబ్స్ లో ఒకరిపై ఒకరు పడటం… కలిసి డాన్సులు చేయటం.. గంతులేయటం వంటివి చేయద్దని హెచ్చరించింది.

దాదాపు ఏడాది కాలంగా మూతబడిన పార్కులు అన్నీంటినీ తిరిగి ఓపెన్ చేయాలని కూడా నిర్ణయించింది ప్రభుత్వం.

బార్లు, పబ్స్, రెస్టారెంట్లు, సినిమా ధియేటర్లు, మాల్స్, పార్కుల్లో మాస్ కచ్చితంగా ధరించాల్సిందే అని.. సామాజిక దూరం పాటించాలని ఆదేశించింది ప్రభుత్వం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు