రెమిడెసివర్ కొంటున్నారా అయితే జాగ్రత్త : ఖాళీ సీసాల్లో సెలైన్ వాటర్ తో సరికొత్త మోసం

fake remedicifir vaccines in market

కరోనా రోగులకు అత్యవసరం అయిన రెమిడెసివర్ ఇంజక్షన్ కొరత ఉన్న సంగతి తెలిసిందే.. రోగుల ఆందోళన, ఆవేదనను ఆసరా చేసుకుని కొందరు ఇంజక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్నారు. వెయ్యి రూపాయల ఇంజక్షన్ 40 వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఇది ఓ రకమైన దందా.. బ్లాక్ మార్కెట్ అయినా.. అధిక ధర అయినా మందు అయితే ఒరిజినల్ ఉంటుంది.

ఇప్పుడు మరో కొత్త తరహా మోసానికి దిగారు నీచులు.. రెమిడెసివర్ ఇంజక్షన్ పేరుతో సైలెన్ వాటర్, నీళ్లను అమ్ముతున్నారు. వాడేసిన రెమిడెసివర్ ఖాళీ ఇంజక్షన్ బాటిళ్లలో అత్యంత తెలివిగా.. సెలైన్ వాటర్ ఎక్కించి.. అదే ఇంజక్షన్ పేరుతో అమ్ముతున్నారు. ఈ తరహా మోసం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్, నర్సు కలిసి.. ఖాళీ రెమిడెసివర్ ఇంజక్షన్ బాటిళ్లలో సెలైన్ ఎక్కించి బ్లాక్ లో అమ్ముతున్నారు. ఉన్న నీళ్లను మందు పేరుతో.. 10 వేలకు అమ్మేస్తున్నరు. రెమిడెసివర్ ఇంజక్షన్ పేరుతో సెలైన్ వాటర్ ను శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు రోగులు. కరోనా తగ్గుతుందని భావించే రోగులకు రోగం తగ్గకపోగా.. ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.

డబ్బులు పోయి.. ప్రాణాలు పోయి.. అన్ని రకాలుగా ఆ కుటుంబం నష్టపోతుంది. కనీసం బ్లాక్ మార్కెట్ అయినా పర్వాలేదు మందు ఒరిజినల్ అవుతుంది.. ఆ పేరుతో సెలైన్ వాటర్ ఇస్తే..ప్రాణాలకే ప్రమాదం కదా అంటున్నారు రోగుల బంధువులు. కనీసం మానవత్వం అనేది కొంచెం కూడా లేకపోతే ఎలా అంటున్నారు సామాన్యులు.. ప్రాణాలతో చెలగాటం.. శవాలపై డబ్బులు ఏరుకోవటం అంటే ఇదే అంటున్నారు. ఇక ఈ దెబ్బకు రెమిడిసిఫిర్ దొరికినా అది అసలైనదో, నకిలోదో తెలుసుకోవడాకి కొత్త టెన్షన్ మొదలైనట్టే.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు