తిరుపతిలో దొంగ ఓట్ల గొడవ ఏంటీ.. ఎన్నికల అధికారులను వివరణ కోరిన ఎన్నికల సంఘం సీఈవో

tirupathi fake votes

తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేస్తుందని.. ఇతర ప్రాంతాల నుంచి మనుషులను తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ అంటోంది. బస్సుల్లో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని అడ్డుకుని ప్రశ్నిస్తూ.. ఉదయం నుంచి ప్రసారం అవుతున్న కథనాలు, వీడియోలను పరిశీలించాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు ఎన్నికల సంఘం సీఈవో విజయానంద్.

నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ కంప్లయింట్ ఆధారంగా ఈ వివరణ కోరుతున్నామని.. విషయం ఏంటో తేల్చాలని.. పరిస్థితిని సమీక్షించి.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇతర ప్రాంతాల నుంచి ఓటు హక్కు లేని వారు సైతం వచ్చి.. ఓట్లు వేస్తున్నారంటూ పోలింగ్ బూత్ ల దగ్గర హడావిడి హడావిడి చేసింది టీడీపీ. ఓట్లను గుర్తింపు కార్డు అడుగుతూ.. అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో ఉన్న వారిని ప్రశ్నిస్తూ.. ఎందుకు వచ్చారు.. దొంగ ఓట్ల కోసం వచ్చారా అంటూ నిలదీసింది. తిరుపతి వస్తున్న బస్సులను అడ్డుకుని నిరసనలు వ్యక్తం చేసింది టీడీపీ.

అధికార టీడీపీ పార్టీ దొంగ ఓట్లు వేయిస్తుందంటూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి కంప్లయింట్ చేసింది. ఈ క్రమంలోనే నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను విచారణ చేయాలన ఆదేశించారు ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈవో విజయానంద్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు