బాయ్ కాట్ అమెజాన్ ప్రైమ్ అంటూ తమిళనాడులో ఉద్యమం.. తలనొప్పిగా హీరోలకు వ్యవహారం

బాయ్ కాట్ అమెజాన్ ప్రైమ్ అంటూ తమిళనాడులో ఉద్యమం.. తలనొప్పిగా హీరోలకు వ్యవహారం

బాయ్ కాట్ అమెజాన్ ప్రైమ్ అంటూ తమిళనాడులో ఉద్యమం.. తలనొప్పిగా హీరోలకు వ్యవహారం

తమిళనాడు.. అక్కడి ప్రజలకు దేశంపై ఎంత ప్రేమ ఉంటుందో అంతకు మించి రాష్ట్రంపై అభిమానం ఉంటుంది. పార్టీలుగా.. హీరోలుగా విడిపోయినా తమిళనాడు ప్రజలుగా ఎప్పుడూ కలిసే ఉంటారు.. అదే వారి బలం. తమిళనాడు అనే పేరు వింటే చాలు.. ప్రజలందరూ పార్టీలు, రాజకీయాలు, సినీ హీరోలు అందరూ దిగి రావాల్సిందే.. ఇప్పుడు అలాంటిదే మరో ఉద్యమం మొదలైంది. అది అమెజాన్ ప్రైమ్ పై ఉడికిపోతున్నారు తమిళీయులు.

ఫ్యామిలీ మెన్ -2 పేరుతో అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్ వచ్చింది. దీని కథ ఎల్టీటీఈ అంశం. ఇందులో ఎల్టీటీఈ ప్రభాకర్ ను చాలా తక్కువ స్థాయిగా.. అమ్మాయిల వీక్ నెస్ ఉన్న లీడర్ గా చూపించారంటూ భగ్గుమంటున్నారు తమిళులు.

ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ పై తమిళ యువతకు ఉన్న అభ్యంతరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం :

> ప్రభాకరన్ ఈలెం నుంచి పారిపోయాడు అని చూపించారు.. ఇది నిజం కాదు. ఆయన ఎప్పుడూ ఈలం విడిచి బయటకు రాలేదు
> ఎల్టీటీఈ లీడర్ ప్రభాకర్ కానీ.. ఎల్టీటీఈ సభ్యులు, సైన్యం మద్యం తాగలేదు
> శ్రీలంకలో ప్రత్యేక ఈలెం కోసం పోరాడుతున్న ప్రభాకరన్.. ఎప్పుడూ ఆ సంస్థ నుంచి బయటకు రాలేదు.
> LTTEకి ఐఎస్ఐఎస్ తో సంబంధం లేవు.. పెట్టుకోలేదు.
> ఎల్టీటీఈ ఎప్పుడూ బూతు మాటలు మాట్లాడలేదు.. వల్గర్ వార్డ్స్ ఉపయోగించలేదు.

పైన చెప్పినటువంటి ఐదు అంశాలను ద ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో తప్పుగా చిత్రీకరించారంటూ.. దుమ్మెత్తిపోస్తున్నారు తమిళ యువత.

ట్విట్టర్ వేదికగా #BoycottAmazonPrime, #BanFamilyMan2, #BoycottAmazon హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. జూన్ 6వ తేదీ ఒక్క రోజే.. లక్షకు పైగా ట్విట్లు పడ్డాయి. వెయ్యి మందికి పైగా కస్టమర్లు.. అమెజాన్ ను అన్ సబ్ స్ట్రయిబ్ అయ్యారు.

ఇదే సమయంలో తమిళనాడు ప్రజలను అవమానిస్తూ తీసిన వెబ్ సీరిస్ ను బాయ్ కాట్ చేసేలా.. అమెజాన్ ప్రైమ్ కు సినిమాలు ఇవ్వొద్దంటూ హీరోలను డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సెంటిమెంట్ హీరోలను తలనొప్పిగా మారింది. అసలే ధియేటర్లు లేవు.. ఇలాంటి టైంలో అమెజాన్ ప్రైమ్ ను బాయ్ చేయాలంటూ తమిళనాడు యువత డిమాండ్ చేస్తుండటంతో.. హీరోలు, నిర్మాతలు తలనొప్పిగా ఫీలవుతున్నారు. తమ సినిమాలను అమెజాన్ కు ఇస్తే.. నెగెటివ్ రేటింగ్ ఇస్తారేమో అనే భయం పట్టుకుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు