కోహ్లీపై అభిమానులు ఆగ్రహం.. కారణం ఇదే

కోహ్లీపై అభిమానులు ఆగ్రహం.. కారణం ఇదే

ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. కాగా శుక్రవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ఏడాది కప్ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్న బెంగళూరు అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.

దింతో సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. టోర్నీ ఆరంభంలో అద్భుతంగా అధిక బెంగళూరు, చివరికి వచ్చేసరికి ఏమైంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోహ్లీసేన శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెత్తగా ఆడి అభిమానుల ఆగ్రహానికి గురైంది. బెంగళూరు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా కప్పు సాధించడం అసాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత జట్టుకు కూడా కోహ్లీ పెద్దగా సాధించినదేమీ లేదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క సారికూడా కప్పు సాధించలేదు బెంగళూరు. ఈ ఏడాది కప్ సాదిస్తుందని అందరు అనుకున్నారు కానీ, చివర్లో చతికిలపడింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు