Deltaplus Veriant Death: దేశంలో మొదటి డెల్టాప్లస్ వేరియంట్ మరణం

Deltaplus Veriant Death: దేశంలో కరోనా వేరియంట్ల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా డెల్టాప్లస్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ కొత్త రకం మ్యూటెంట్ కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా మధ్యప్రదేశ్ లో డెల్టాప్లస్ వేరియంట్ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉజ్జయినిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉజ్జయిని నగరంలో మొత్తం ఐదుగురిలో డెల్టాప్లస్ వేరియంట్ లక్షణాలు కనిపించాయి. వీరిలో నలుగురు ఈ వేరియంట్ నుంచి బయటపడగా ఒకరు మాత్రం మృతి చెందారు. అయితే మృతి చెందిన వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోలేదని వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న మిగతా నలుగురు డెల్టాప్లస్ ను జయించారని తెలిపారు. దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు.

దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ అన్ని మ్యూటెంట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెబుతున్నారు. వ్యాక్సినే సంజీవని అని.. భయపడాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 40 డెల్టాప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు