వ్యాక్సిన్ తరహాలోనే ట్యాబ్లెట్లు వస్తున్నాయి.. ఆరు నెలల్లో తీసుకొస్తామన్న అమెరికా సంస్థ..

fizer to release tablet for corona virus

ప్రపంచంలోనే కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీతోపాటు.. అత్యంత సమర్థవంతంగా పని చేసే వ్యాక్సిన్ ఏదైనా ఉందీ అంటే అది అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్. ఇదే కంపెనీ ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ తరహాలోనే.. కరోనా వైరస్ నిర్మూలన కోసం నోట్లో నుంచి వేసుకుని ట్యాబ్లెట్ తయారీ ప్రయోగాలు చేస్తుంది. ఇంజక్షన్ రూపంలో ఉన్న మందును.. బ్యాబ్లెట్ రూపంలో అందుబాటులోకి తీసుకురావటం వల్ల.. వైరస్ నుంచి ప్రజలను మరింత సురక్షితంగా మార్చొర్చని ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ వివరించారు.

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కట్టడి చేయాలంటే ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు.. వ్యాక్సిన్ తయారీ.. రవాణా.. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం సవాల్ గా మారింది. ప్రపంచంలోని అందరికీ రెండు డోసులు ఇవ్వాలంటే.. కనీసం ఐదేళ్లు అయినా పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్యాబ్లెట్ రూపంలో కరోనా వైరస్ మందు తీసుకొస్తున్నట్లు వివరించారు.

ప్రయోగ దశలో ఉన్న ఈ ట్యాబ్లెట్.. 2021 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావొచ్చు భరోసా ఇస్తోంది ఫైజర్ సంస్థ. ఇదే జరిగితే బ్యాబ్లెట్ల తయారీ చాలా ఈజీ ప్రాసెస్ అని.. ప్రతి రోజు కోట్లలో తయారు చేయొచ్చు అని.. నెల రోజుల్లోనే ప్రపంచంలోని 700 కోట్ల మంది వేయొచ్చని.. తర్వాత ద్వారా కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడొచ్చని చెబుతోంది కంపెనీ.

ఫైజర్ సంస్థ చెప్పినట్లు కరోనా వైరస్ కు ట్యాబ్లెట్ వచ్చినట్లయితే.. నిజంగా ప్రపంచంలోని మానవాళిని కాపాడినట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. వీలైనంత త్వరగా దీన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు