హైదరాబాద్ లో ఫ్రీ వైద్యం – మీకు తెలుసా ఈ విషయం

ఇక నుంచి హైదరాబాదీలు ఎవరూ కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షలకు లక్షలు

హైదరాబాద్ సిటీలో బస్తీ దవాఖానాలను గురువారం ప్రారంభించారు మంత్రులు ఈటెల రాజేందర్, మల్లారెడ్డి. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు సిటీ వ్యాప్తంగా ప్రతి బస్తీలో క్లీనిక్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది గత ఎన్నికల్లో. ఇప్పుడు వాటికి కార్యరూపం ఇస్తూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దత్తాత్రేయనగర్ లో బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో కలిసి ప్రారంభించారు వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్.

అదే విధంగా కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని కె.పి.హెచ్.బి కాలనీలో బస్తీ దవాఖానా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు వివరించారు మంత్రులు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు మంత్రులు.

ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో.. ప్రతి బస్తీలో ఈ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయటంతోపాటు మందులు కూడా ఇవ్వనున్నారు. ఇక నుంచి హైదరాబాదీలు ఎవరూ కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు