బీజేపీ ఇంచార్జీలు వీరే – ఆంధ్ర ఏరియాకు ఎంపీ అరవింద్ – ఆట మొదలైంది

మల్కాజిగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు, కూకట్ పల్లి నియోజకవర్గానికి పెద్దిరెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహంలో బిజీగా ఉంది బీజేపీ. ఇప్పటికే అభ్యర్థుల మొదటి లిస్ట్ ప్రకటించిన క్రమంలో.. ఆయా డివిజన్లకు ఇంచార్జీలను ప్రకటించింది. నియోజకవర్గానికి ఓ ప్రజా ప్రతినిధిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఎంపీ ధర్మపురి అరవింద్ ను నియమిస్తే.. మల్కాజిగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు, కూకట్ పల్లి నియోజకవర్గానికి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ సంచలన ప్రకటన చేసింది.

మహేశ్వరం నియోజకవర్గానికి యెన్నం శ్రీనివాసరెడ్డి
రాజేంద్రనగర్ నియోజకవర్గానికి పన్నాల శ్రీరాములు
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఎంపీ ధర్మపురి అరవింద్

ఉప్పల్ నియోజకవర్గానికి ధర్మారావు
మల్కాజిగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు
కూకట్ పల్లి నియోజకవర్గానికి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి
పటాన్ చెరు నియోజకవర్గానికి పొంగులేని శ్రీనివాసరెడ్డి
అంబర్ పేట నియోజకవర్గానికి ప్రకాష్ రెడ్డి
ముషీరాబాద్ నియోజకవర్గానికి జితేందర్ రెడ్డి

సికింద్రాబాద్ నియోజకవర్గానికి విజయరామారావు
కంటోన్మెంట్ నియోజకవర్గానికి శశిథర్ రెడ్డి
సనత్ నగర్ నియోజకవర్గానికి మోత్కుపల్లి నరసింహులు
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎర్ర శేఖర్
చార్మినార్ నియోజకవర్గానికి లింగయ్య
నాంపల్లి నియోజకవర్గానికి సోయం బాపూరావు
గోషామహల్ నియోజకవర్గానికి లక్ష్మీనారాయణ

కార్వాన్ నియోజకవర్గానికి బోడిగే శోభ
మలక్ పేట నియోజకవర్గానికి విజయపాల్ రెడ్డి
యాకత్ పురా నియోజకవర్గానికి రామకృష్ణారెడ్డి
చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి రవీంద్రనాయక్
బహుదూర్ పుర నియోజకవర్గానికి సుద్దాల దేవయ్య
ఖైరతాబాద్ నియోజకవర్గానికి మృత్యుంజయం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు