జీహెచ్ఎంసీ ఎన్నికల క్రిమినల్ రికార్డ్స్ ఉన్న అభ్యర్థులు

ఈ 72 మందిలో 8 మంది మహిళలపైనా కేసులు ఉండటం విశేషం

జీహెచ్ఎంసీ ఎన్నికలు మళ్లీ వస్తున్న వేళ.. ఆయా పార్టీలకు షాక్ ఇస్తూ ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించింది ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్. 72 మంది అభ్యర్థులపై క్రిమినల్ చిట్టా ఉందని వివరించింది. పార్టీల వారీగా చూస్తే లెక్కలు ఇలా ఉన్నాయి.

టీఆర్ఎస్ పార్టీ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 13 మంది, కాంగ్రెస్ నుంచి 13 మంది, బీజేపీ నుంచి 4గురు, ఇండిపెండెంట్లు 11 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి.

ఈ 72 మందిలో 8 మంది మహిళలపైనా కేసులు ఉండటం విశేషం

ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తోంది ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్. నేర చరితుల లిస్టులో అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీ వారే ఉండటం విశేషం.

ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో పార్టీలు చూడాలి. 2016లో ఆయా పార్టీల నుంచి ఈ అభ్యర్థులు పోటీ చేశారు. 30 మంది నేరచరితుల కార్పొరేటర్లు ప్రస్తుతం పదవుల్లో ఉన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు