జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రారంభం – 18 నుంచే నామినేషన్లు – డిసెంబర్ 1న పోలింగ్

డిసెంబర్ ఒకటో తేదీన పోలింగ్. డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్

హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి. తెలంగాణ అసెంబ్లీ చేసిన కొత్త చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించటం జరుగుతుందని ప్రకటించారు.
నవంబర్ 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. 18, 19, 20వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణ

నవంబర్ 21వ తేదీన నామినేషన్ల పరిశీలన. 22వ తేదీన నామినేషన్ ఉప సంహరణ. ఫైనల్ అభ్యర్థుల ప్రకటన.

డిసెంబర్ ఒకటో తేదీన పోలింగ్. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్
రీ పోలింగ్ 3వ తేదీన నిర్వహణ
డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్

నవంబర్ 17వ తేదీ నుంచే ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వస్తుంది. కోడ్ అమల్లో ఉంటుంది. నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
బ్యాలెట్ పద్దతిలో ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది.
2016 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లనే ప్రస్తుత ఎన్నికల్లో అమలు కాబోతున్నాయి
21వ తేదీన పోలింగ్ స్టేషన్లు ఎన్ని అనేది ఫైల్ అవుతుంది

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు