జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్ సర్వేలు – ఏయే పార్టీకి ఎన్ని సీట్లు అంటే..

జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్ సర్వేలు - ఏయే పార్టీకి ఎన్ని సీట్లు అంటే.. టీఆర్ఎస్ పార్టీ 38 శాతం, బీజేపీ 32 శాతం ఓట్లు రాబట్టుకున్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య 6 శాతం ఓట్ల తేడా ఉన్నట్లు

ఓల్డ్ మలక్ పేట రీ పోలింగ్ ముగిసిన వెంటనే ఆయా సర్వే సంస్థలు.. జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్ సర్వేలను వెల్లడించాయి. అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.. మేయర్ పీఠం వారిదే అని చెబుతున్నా.. గత ఎన్నికల్లో సాధించిన 99 సీట్లను టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఆయా సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేలు ఫలితాలను చూద్దాం…

ఆరా సర్వే ఫలితాలు :

టీఆర్ఎస్ పార్టీ – 78 సీట్లు
బీజేపీ పార్టీ – 28 స్థానాలు
కాంగ్రెస్ పార్టీకి – 3 స్థానాలు
ఎంఐఎం పార్టీకి – 41 సీట్లు

సీపీఎస్ టీం సర్వే ఫలితాలు :

టీఆర్ఎస్ పార్టీ – 82 నుంచి 96 సీట్లు
బీజేపీ పార్టీ – 12 నుంచి 20 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి – 3 నుంచి 5 స్థానాలు
ఎంఐఎం పార్టీకి – 32 నుంచి 38 సీట్లు

ఓట్ల శాతం అంచనా వేస్తే.. టీఆర్ఎస్ పార్టీ 40 శాతం, బీజేపీ 28 శాతం ఓట్లు సాధించవచ్చని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 14.7 శాతం, ఎంఐఎం 13.4శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు కైవసం చేసుకుంటారని సీపీఎస్ సర్వే సంస్థ ప్రకటించింది.

పీపుల్స్ సర్వే ఎగ్జిట్ ఫలితాలు :

టీఆర్ఎస్ పార్టీ – 68 నుంచి 78 సీట్లు
బీజేపీ పార్టీ – 25 నుంచి 35 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి – 1 నుంచి 5 స్థానాలు
ఎంఐఎం పార్టీకి – 38 నుంచి 42 స్థానాలు

ఓట్ల శాతం చూస్తే.. టీఆర్ఎస్ పార్టీ 38 శాతం, బీజేపీ 32 శాతం ఓట్లు రాబట్టుకున్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య 6 శాతం ఓట్ల తేడా ఉన్నట్లు పీపుల్స్ సర్వే సంస్థ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి 12 శాతం ఓట్లు వచ్చినా.. ఒకటి నుంచి 5 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఎంఐఎం పార్టీ 13 శాతం ఓట్లు వచ్చినా.. 38 స్థానాలు కచ్చితంగా గెలుస్తుందని చెబుతున్నారు.

నాగన్న సర్వే ఫలితాలు :

టీఆర్ఎస్ పార్టీ – 95 నుంచి 101 సీట్లు
బీజేపీ పార్టీ – 5 నుంచి 12 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి – ఒక్క స్థానం
ఎంఐఎం పార్టీకి – 35 నుంచి 38 స్థానాలు

అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అని స్పష్టంగా చెబుతున్నాయి. బీజేపీ ఎన్ని సీట్లు, ఓట్లు గెలుస్తుంది అనేది ఆసక్తికరం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు