జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం – ఈసీ సంచలన నిర్ణయం

జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం - ఈసీ సంచలన నిర్ణయం.. ఆ తర్వాతే ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రసారం చేయాలని పత్రికలు, టీవీ ఛానల్స్ కు ఆదేశాలు ఇచ్చింది ఈసీ. డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.. ఆ వెంటనే న్యూస్ ఛానల్స్ హడావిడి నడుస్తుంది.. ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఏ పార్టీ గెలుస్తుంది అని సర్వేలు వచ్చేస్తాయి.. డిసెంబర్ 4వ తేదీ ఫలితాల అంచనాలను ముందే చెప్పేస్తాయి సర్వేలు.

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఛానల్స్ ప్రసారం చేయటానికి వీల్లేదంటూ నిషేధం విధించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. దీనికి కారణం ఏంటంటే.. ఓల్డ్ మలక్ పేటలో ఎన్నికల గుర్తులు మారిపోవటం. అక్కడ డిసెంబర్ 3వ తేదీన రీ పోలింగ్ జరగబోతున్నది. బ్యాలెట్ పేపర్ లో సీపీఐ పార్టీ సింబల్ మారిపోవటంతో.. ఆ పార్టీ అభ్యర్థి ఈసీకి కంప్లయింట్ చేశారు. జరిగిన పొరపాటును గుర్తించి.. వెంటనే ఎన్నికలను రద్దు చేశారు.

డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు రీ పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాతే ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రసారం చేయాలని పత్రికలు, టీవీ ఛానల్స్ కు ఆదేశాలు ఇచ్చింది ఈసీ. డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఇచ్చినా ఫలితం లేదు.

ఎందుకంటే.. డిసెంబర్ 4వ తేదీ జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు