హైదరాబాద్ : To-Let బోర్డు పెట్టినందుకు 2 వేలు జరిమానా – కుకట్ పల్లి వ్యక్తి షాక్ ఇచ్చిన GHMC

GHMC Shock on tolet board

ఒక్క హైదరాబాద్ అనే కాదు, దేశంలో ఎక్కడైనా ఇంటి ఓనర్లు తమ ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకున్నప్పుడు To-Let అనే బోర్టును ఇంటి గేటుకే కాకుండా, మెయిన్ రోడ్డు మీద ఉన్న కరెంట్ స్తంభాలకు కూడా తగిలిస్తుంటారు.

అలా ఒక కరెంట్ స్తంభానికి ఓర్డు తగిలించిన ఓ ఇంటి ఓనర్ కు GHMC అధికారులు షాక్ ఇచ్చారు. కరెంట్ స్తంభంపై బోర్డు పెట్టడం వల్ల ఆ స్తంభం అందవికారంగా తయారైన కారణంగా 2 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ To-Let బోర్దు పెట్టిన ప్రదేశం హైదరాబాద్ లోని కూకట్ పల్లి కాగా,సదరు వ్యక్తి సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం పాములపర్తి గ్రామంలో నివాసం ఉంటున్నాడు.

గుర్తు తెలియని సొసైటీ ఫిర్యాదు – కుకట్ పల్లి వ్యక్తి షాక్ ఇచ్చిన GHMC

గోడలు, కరెంట్ స్తంభాలపై ఇలా వాణిజ్య ప్రకటనలు, వాల్ పోస్టర్లు , To-Let బోర్డులు పెట్టడం వల్ల అవి వాటి అందాన్ని కోల్పోతున్నాయని, కుకటపల్లికి చెందిన ఒక సొసైటి GHMC కి ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం మనం పైన చెప్పుకున్న చర్యలు తీసుకున్నారు.

మాస్క్ లేనందుకు ఫైన్, తాగితే ఫైన్ ,లైసెన్స్ లేక పోతే ఫైన్ , సిగ్నల్ లేకపోతే ఫైన్ ఇలా వందల రకాల ఫైన్లకు తోడు మరో కొత్త ఫైన్ తోడైందని మాట. ఏదేమైన ఇంటి ఒనర్లు జాగ్రత్త స్తంభం ఖాళీగా ఉంది కదా అని బోర్డు పెట్టకండి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు