13 రోజుల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు – ఊహించని షెడ్యూల్ తో పార్టీలు షాక్

ఊహించని విధంగా షెడ్యూల్ తేదీ రావటంతో పార్టీలు సైతం షాక్ అయ్యాయి. నామినేషన్ల దాఖలుకు కూడా మూడు

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా 13 రోజుల్లో పోలింగ్ ప్రక్రియ ముగుస్తోంది. 17వ తేదీన షెడ్యూల్ విడుదల చేస్తే.. 18 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ ఉంటుంది. 4వ తేదీన కౌంటింగ్ ఉండనుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనే కొత్త చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ఎన్నికల సంగం. అందరూ డిసెంబర్ 4 లేదా 7వ తేదీన పోలింగ్ ఉంటుంది అని భావించారు. ఊహించని విధంగా షెడ్యూల్ తేదీ రావటంతో పార్టీలు సైతం షాక్ అయ్యాయి. నామినేషన్ల దాఖలుకు కూడా మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో.. ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికపై అప్పుడే కసరత్తు మొదలుపెట్టాయి. పోటీదారులు సైతం పార్టీ ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు.

ఇంత టైట్ షెడ్యూల్ తో అధికారి పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడ వేసిందని.. ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుని.. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ దూకుడుకు కల్లెం వేయటానికి.. ప్రచారానికి అవకాశం లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ అంటున్నాయి పార్టీలు.
13 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగించటాన్ని చూస్తుంటే.. ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఇది మైనస్ అనే వాదన టీఆర్ఎస్ పార్టీలో ఉంది. టైం ఎంత అన్నది కాదు ముఖ్యం.. 13 రోజులు కాదు.. మూడు రోజుల్లోనే పెట్టినా సిద్ధమే అంటూ బీజేపీ నేతలు అంటున్నారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు